నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ అంశాలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న పార్లమెంట్ ముట్టడికి సీజేపీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ లాఠీఛార్జ్ ను నిరసిస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తదతరులు ప్రధాని నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.
ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని పోలీసులు అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంకా గాంధీని ఉంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రయత్నించారు. కానీ, భద్రతా కారణాల రీత్యా ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. కాసేపటి తర్వాత రాహుల్ గాంధీని ఛత్రసాల్ పీఎస్ నుంచి, ప్రియాంకా గాంధీని మందిర్ మార్గ్ పీఎస్ నుంచి విడుదల చేశారు.