దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన గ్లామర్, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల తార పూజా హెగ్డే(Pooja Hegde) వ్యక్తిగత జీవితం గురించిన వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం కెరీర్ పీక్స్‌లో ఉన్న ఈ బుట్టబొమ్మ, సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికీ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, పూజా హెగ్డే పెద్దలు కుదిర్చిన వివాహాని(Marriage)కి ఓకే చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యువకుడిని వరుడిగా నిశ్చయించినట్లు ప్రచారం జరుగుతోంది.
పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టశాలి ఎవరనే దానిపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వరుడు బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి అని, ఈ వివాహానికి సంబంధించిన నిశ్చితార్థం లేదా పెళ్లి తేదీ త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని టాలీవుడ్(Tollywood)వర్గాలుంటున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు పూజా హెగ్డే గానీ, ఆమె టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
పెళ్లి వార్తలు ఎలా ఉన్నప్పటికీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సరసన 'శ్రీ శ్రీ', రాఘవ లారెన్స్ తో కలిసి 'కాంచన-4' వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. మరి ఈ రూమర్లపై పూజా హెగ్డే స్వయంగా స్పందించి క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.