సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రం, సైకిల్ అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా: బుచ్చి రామ్ ప్రసాద్

admin
Published by Admin — August 29, 2026 in Andhra
News Image

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా అనిపించింది. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న టాప్-10 సభ్యుల్లో ఒకరిగా గుర్తించి సైకిల్‌ను అందజేయడం నాకు మరింత ఉత్సాహాన్ని, బాధ్యతను కలిగించింది.

తెలుగుదేశం పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వానికి అనుగుణంగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తూ, ప్రజలకు పార్టీ సిద్ధాంతాలను, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత చేరువ చేయడమే నా ప్రధాన లక్ష్యం.

నాకు లభించిన ఈ ప్రశంసా పత్రం, సైకిల్ కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు.. పార్టీ పట్ల నా బాధ్యతను మరింత పెంచిన ప్రోత్సాహం. ఈ గౌరవాన్ని అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ గుర్తింపు వెనుక నన్ను ప్రోత్సహించిన పార్టీ నాయకులకు, నాతో కలిసి నిరంతరం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సహకారం, ఆశీస్సులతో మరింత ఉత్సాహంగా పనిచేస్తూ, తెలుగుదేశం పార్టీ జెండా ఎల్లప్పుడూ ప్రజల కోసం ఎగురుతూ ఉండేలా చంద్రబాబు గారు – లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి నా వంతు కృషి నిరంతరం కొనసాగిస్తాను.

ఈ గౌరవం నాది మాత్రమే కాదు.. నన్ను నమ్మి నాతో కలిసి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తది.

 బుచ్చి రామ్ ప్రసాద్ – బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

News Image
News Image
News Image
Tags
Ap brahman corporation chairman buchi ram Prasad felicitated cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News

Latest News