ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాక్షి మీడియాలో నిరాధార ఆరోపణలతో ప్రత్యేక కథనాలు వండి వారుస్తున్నారు. అయితే, వారి ఆరోపణలు ఫేక్ అని కొందరు అభ్యర్థులు ఆధారాలతో సహా వీడియోలు రిలీజ్ చేయడంతో వైసీపీ నేతల పప్పులు ఉడకడం లేదు. తనకు మెగా డీఎస్సీలో ఉద్యోగం రాకపోయినా వచ్చిందని రాధిక అనే మహిళ సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు స్కూల్ అసిస్టెంట్ గా ఇంగ్లిష్ టీచర్ ఉద్యోగం వచ్చిందని నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమని సవాల్ విసురుతున్నాడు రామకృష్ణ అనే అభ్యర్థి.
రామకృష్ణ అనే అభ్యర్థికి మంత్రి లోకేశ్ కోటాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిందని రాధిక అనే మహిళ సాక్షి టీవీ లైవ్ లో ఆరోపించారు. దీంతో, ఆ ఆరోపణలపై విద్యా శాఖ విచారణకు కూడా ఆదేశించింది. అయితే, అసలు రామకృష్ణకు ఉద్యోగమే రాలేదని తేలడంతో సాక్షిలో జగన్ ఫేక్ ప్రచారం చేయించాడని బట్టబయలైంది. స్వయంగా రామకృష్ణ తనకు ఉద్యోగం రాలేదని ఓ వీడియో విడుదల చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సరైన ప్రిపరేషన్ లేక డీఎస్సీలో క్వాలిఫై కాలేదని, అయినా ఏమాత్రం కుంగిపోకుండా ప్రైవేట్ స్కూల్‌లో ఉద్యోగం చేస్తున్నానని రామకృష్ణ చెప్పాడు.
తనకు ఏ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం వచ్చిందో రాధిక గారు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేస్తున్నాడు. ఒకవేళ తనకు జాబ్ వచ్చిందని ఆమె నిరూపిస్తే ప్రభుత్వం విధించే ఏ శిక్షకైనా ఆఖరికి ఉరిశిక్షకైనా సిద్ధమని ఛాలెంజ్ చేశాడు. నిజాయితీ ఉంది కాబట్టి తాను ఛాలెంజ్ చేశానని, మరి, రాధికతోపాటు ఆమె వెనుక ఉన్న వ్యక్తులు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారా అని ఆ యువకుడు ప్రశ్నిస్తున్నాడు. వేలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఆత్మగౌరవంతో జగన్ ఆడుకుంటున్నారు. కానీ, రామకృష్ణ స్టేట్మెంట్ తో డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారం బట్టబయలైంది. డీఎస్సీపై లోకేష్ మూడు సార్లు ఛాలెంజ్ చేసినా జగన్ స్వీకరించలేదని, కనీసం, రామకృష్ణ ఛాలెంజ్ అయినా స్వీకరించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.