హెడ్ మాస్టర్ పై సాక్షి ప్రతినిధుల దౌర్జన్యం

admin
Published by Admin — September 07, 2026 in Politics
News Image

మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీది ఫేక్ ప్రచారం అని తేటతెల్లమవుతున్న సంగతి తెలిసిందే. తమ దుష్ప్రచార పర్వానికి బ్రేక్ పడడంతో జగన్ అండ్ కో కొత్త దారులు వెతుకుతున్నారు. తమ గుట్టు రట్టయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఏం చేయాలో పాలుపోక చివరకు బెదిరింపులకు దిగుతున్నారు. కుప్పంలో ఓ ప్రధానోపాధ్యాయుడిని సాక్షి మీడియా ప్రతినిధులు బెదిరించిన వైనం షాకింగ్ గా మారింది. అది కూడా ఉపాధ్యాయుల దినోత్సవం నాడు బడిలోకి చొరబడి విద్యార్థుల ముందే నువ్వు నకిలీ ఉపాధ్యాయుడివి అంటూ సాక్షి మీడియా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

బోర్డర్ లో ప్రాణాలకు తెగించి మరీ సేవలందించిన ఒక మాజీ సైనికుడు స్పోర్ట్స్ కోటాలో మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించాడు. భారత సైన్యంలో హవల్దార్‌గా పనిచేసి రిటైర్ వి.చక్రపాణి రెడ్డి రోజుకు 16 గంటలకు పైగా కష్టపడి చదివి మెగా డీఎస్సీలో ఎక్స్-సర్వీస్‌మెన్ కోటాలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. కుప్పం మండలం నడిమూరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ, రాజకీయ దురుద్దేశంతో ఆయనపై కక్షగట్టిన సాక్షి మీడియా ఆయనను వేధించడం మొదలుబెట్టింది.

నీవి ఫేక్ సర్టిఫికెట్లు, నీది ఫేక్ పోస్టింగ్ అంటూ నాలుగు రోజులుగా చక్రపాణికి సాక్షి మీడియా ప్రతినిధులు ఫోన్ చేసి వేధిస్తున్నారు. సర్టిఫికెట్లు చూపించాలని, లేదంటే తప్పుడు వార్తలు రాస్తామని బ్లాక్‌మెయిల్ చేశారు. చివరకు టీచర్స్ డే నాడు క్లాస్ రూంలో విద్యార్థుల ముందు చొక్కా కాలర్ పట్టుకునేంత పని చేశారుని చక్రపాణి వాపోయారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇటువంటి పాత్రికేయులపై చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.

Tags
Mega dsc sakshi media representatives misbehaved with head master
Recent Comments
Leave a Comment

Related News