సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఎప్పుడూ రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి, పిల్లలు వంటి విషయాలపై అభిమానుల్లో ఎప్పుడూ భారీగానే క్యూరియాసిటీ ఉంటుంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు తమ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో మాతృత్వాన్ని కాస్త దూరంగా పెడుతుంటారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మాత్రం తన ప్రెగ్నెన్సీకి సంబంధించి తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను వివాహం చేసుకున్న తర్వాత సామ్ లైఫ్‌లో ఊహించని మలుపు తిరిగింది. వాస్తవానికి తాము ఇద్దరం ఇనిషియల్‌గా పిల్లల గురించి అసలు ప్లాన్ చేసుకోలేదని సమంత వెల్లడించారు. ఒకానొక దశలో భార్యాభర్తలుగా తమకు పిల్లలు లేకపోయినా పర్వాలేదనే నిర్ణయానికే వచ్చామని, ఆ విషయమై పెళ్లికి ముందే స్పష్టతతో మాట్లాడుకున్నామని ఆమె తెలిపారు. ఇద్దరి అంగీకారంతోనే ఆ ఆలోచనను పక్కనపెట్టామని సామ్ గుర్తుచేసుకున్నారు.
అయితే ఊహించని విధంగా తనకు ప్రెగ్నెన్సీ రావడం మాత్రం పెద్ద సర్‌ప్రైజ్ అని ఆమె పేర్కొన్నారు. 'మా ఇంటి బంగారం(Maa Inti Bangaaram)' చిత్రంలోని 'తస్సాదియ్యా' పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో శారీరకంగా కాస్త నీరసంగా అనిపించడంతో డాక్టర్‌ను సంప్రదించానని, ఆ టెస్టుల వల్లే తాను గర్భం దాల్చిన విషయం తెలిసిందని సమంత వివరించారు. ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వచ్చిన ఈ గుడ్‌న్యూస్ తమకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.