చావు బతుకుల్లో సింగ‌ర్ క‌ల్ప‌న‌.. పోలీసుల అదుపులో ఆమె భ‌ర్త‌!

admin
Published by Admin — March 05, 2025 in Movies
News Image

ప్రముఖ సింగర్ క‌ల్ప‌న‌ రాఘవేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉన్న వర్టెక్స్‌ ప్రివిలేజ్ గేటెడ్ క‌మ్యూనిటీలోని విల్లాలో నివాసం ఉంటున్న క‌ల్పిన ఎక్క‌వ మొత్తంలో నిద్ర మాత్ర‌లు తీసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. రెండు రోజులుగా ఇంటి తలుపులు తెర‌వ‌క‌పోవ‌డంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వ‌చ్చి అసోసియేషన్‌ సభ్యులకు చెప్ప‌గా.. వారు పోలీసులకు స‌మాచారం అందించారు. పోలీసులు వెళ్లే స‌రికే కల్పన చావు బ‌దుకుల్లో మంచంపై పడి ఉన్నారు

క‌ల్ప‌న నిద్ర మాత్రలు మింగినట్లు గుర్తించిన పోలీసులు.. హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది. అయితే కల్పన సూసైడ్‌ అటెంప్ట్ కేసులో ఆవిడ భర్త ప్ర‌సాద్ ప్ర‌భాక‌ర్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల నుంచి ఇంట్లో లేని ప్ర‌భాక‌ర్‌.. క‌ల్ప‌న విష‌యం తెలియ‌గానే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయ‌న్ను అదుపులోని తీసుకున్న పోలీసులు.. ఇంటికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అలాగే క‌ల్ప‌న నివాసంలో తనిఖీలు చేపట్టారు. కల్పన మ‌రియు ఆమె భర్త ప్రసాద్ ఫోన్లను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.

ప్ర‌స్తుతం క‌ల్ప‌న సూసైడ్ ఇష్యూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో సెన్సేష‌న్ గా మారింది. తమిళనాడుకు చెందిన కల్పన రాఘవేంద్ర దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి గాయనిగా రాణిస్తుంది. క‌ల్ప‌న తండ్రి టి.యస్. రాఘవేంద్ర ప్రముఖ నేపథ్య గాయకుడు కాగా.. తల్లి సులోచన కూడా గాయకురాలే. క‌ల్ప‌న తమ్ముడు షికినా షాన్ ఒక ఒపెరా సింగర్. సంగీత కుటుంబంలో జ‌న్మించిన క‌ల్ప‌న.. మూడేళ్ల‌కే బాల‌న‌టిగా మారింది. దక్షిణ భారతీయ భాషల్లో సుమారు 30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

అలాగే ఐదేళ్ల‌కే సింగ‌ర్ గా మారిన‌ క‌ల్ప‌న.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 3000లకు పైగా పాటలు పాడారు. డబ్బింగ్‌ ఆర్టిస్టుగానూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. టాలీవుడ్ లో ప్ర‌ముఖ సింగ‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ స్థాయిలో రావ‌డానికి క‌ల్ప‌న ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ అనేక ఒడిదుడుకుల‌ను ఫేస్ చేశారు. 2010లో క‌ల్ప‌న త‌న మొద‌టి భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అప్ప‌టికే ఆమెకు ఓ కూతురు ఉంది.

విడాకులతో క‌ల్ప‌న సర్వస్వం కోల్పోయింది. సింగ‌ర్ గా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. బ్ర‌తుకే భారంగా మారింది. అలాంటి స‌మ‌యంలో ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని కూడా భావించిన‌ట్లు గ‌తంలో క‌ల్ప‌న ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. అయితే సింగర్ చిత్రమ్మ ఇచ్చిన ధైర్యంతో క‌ల్ప‌న మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టి నిల‌దొక్కుకున్నారు. 2018లో ప్ర‌సాద్ ప్ర‌భాక‌ర్ ను క‌ల్ప‌న్ రెండో వివాహం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ప్ర‌సాద్ ప్ర‌భాక‌ర్ ఒక వ్యాపార‌వేత్త‌. ఐదేళ్లుగా క‌ల్ప‌న‌, ప్ర‌భాక‌ర్ దంప‌తులు నిజాంపేట ఏరియాలో గల వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాలో నివాసం ఉంటున్నారు‌‌. భార్య భర్తల సత్సంబంధాలు ఉన్నాయని, చాలా మంచిగా మాట్లాడే వారని విల్లా సెక్రటరీ వెంకట్ రెడ్డి చెబుతున్నారు. మ‌రోవైపు పోలీసుల ద‌ర్యాప్తులో క‌ల్ప‌న‌కు, ఆమె కూతురుకి త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయ‌ని తేలింది. దీంతో క‌ల్ప‌న సూసైడ్ చేసుకోవ‌డానికి కార‌ణం ఏంటి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది

Recent Comments
Leave a Comment

Related News