`రాబిన్‌హుడ్‌` లో స్టార్ క్రికెట‌ర్‌.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్!

admin
Published by Admin — March 05, 2025 in Movies
News Image

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా, శ్రీ‌లీల హీరోయిన్ గా డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల రూపొందించిన తాజా చిత్రం `రాబిన్‌హుడ్‌`. భీష్మ వంటి హిట్ అనంత‌రం నితిన్‌, వెంకీ కుడుముల కాంబోలో వ‌స్తున్న రెండో చిత్ర‌మిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిత‌మైన రాబిన్‌హుడ్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే హ్యుజ్ బజ్ క్రియేట్ అయింది. ప్ర‌మోష‌న్స్ ద్వారా చిత్ర‌బృందం మ‌రింత హైప్ పెంచుతున్నారు.

ఇక‌పోతే రాబిన్‌హుడ్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ కూడా న‌టించాడు. తాజాగా ఈ విష‌యాన్ని ఓ ఈవెంట్‌లో మేక‌ర్స్ క‌న్ఫార్మ్ చేశారు. నిజానికి వార్న‌ర్ అద్భుత‌మైన క్రికెట‌ర్ మాత్ర‌మే కాదు మంచి నటుడు కూడా. కోవిడ్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వార్న‌ర్ త‌న యాక్టింగ్ స్కిల్స్ తో అంద‌ర్నీ అబ్బుర‌ప‌రిచాడు. ముఖ్యంగా మ‌హేష్ బాబు, అల్లు అర్జున్‌, ప్ర‌భాస్ వంటి టాలీవుడ్ హీరోల పాట‌ల‌కు స్టెప్పులేస్తూ సౌత్ మూవీ ల‌వర్స్ కు వార్న‌ర్ ఎంత‌గానో చేర‌వ‌య్యాడు.

ఇప్పుడు నేరుగా వార్న‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అది కూడా తెలుగు సినిమాతో. నితిన్ హీరోగా తెర‌కెక్కిన రాబిన్‌హుడ్‌లో వార్న‌ర్ ఒక చిన్న పాత్ర‌ను పోషించాడు. అందుకుగానూ వార్న‌ర్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. పారితోషికంగా విషయంలో వార్న‌ర్ ఎటువంటి డిమాండ్ చేయ‌న‌ప్ప‌టికీ.. అత‌నికి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు రూ. 50 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ని ఇన్‌సైడ్ జోరుగా టాక్ న‌డుస్తోంది.

Recent Comments
Leave a Comment

Related News