వైసీపీకి బిగ్ షాక్‌.. మ‌రో మాజీ ఎమ్మెల్యే రాజీనామా

admin
Published by Admin — September 21, 2026 in Politics, Andhra
News Image

ఏపీ రాజకీయాల్లో మరో పరిణామం కలకలం రేపింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు(Prathipadu) నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్‌ఛార్జ్‌ వరుపుల సుబ్బారావు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో నెలకొన్న స్తబ్ధత, కేడర్‌కు తగిన భరోసా కరవడం, అంతర్గత వ్యవహారాలపై విసుగు చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వరుపుల సుబ్బారావు(Varupula Subbarao)... తన కెరీర్‌లో ఇప్పటివరకు కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ పార్టీల్లో కొనసాగారు. ఇప్పుడు తాజాగా వైసీపీని వీడి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే ఆయన పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో అధికారికంగా జనసేన కండువా కప్పుకోనున్నారు.

2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన, కాలక్రమేణా రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా పార్టీలు మారుతూ వచ్చారు. 2014లో వైసీపీ(YCP)లో చేరి రెండోసారి విజయం సాధించినా, కొద్దికాలానికే టీడీపీలోకి ఫిరాయించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు మళ్లీ సొంత గూటికి చేరి ప్రత్తిపాడు ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

అయితే తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఆయన మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన(Janasena)లోకి ప్రవేశించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. మరి ఈ మారిన రాజకీయం ప్రత్తిపాడులో ఏ రకమైన సమీకరణాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags
Varupula Subbarao YSRCP Janasena Prathipadu Politics AP Politics Pawan Kalyan Andhra Pradesh AP Local Elections
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News