ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి లో `ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే` అంటూ ఐటమ్ సాంగ్ కు స్టెప్పులేసి టాలీవుడ్ ను షేక్ చేసిన ముమైత్ ఖాన్.. తాజాగా కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అయ్యింది. ముంబైలో పుట్టి పెరిగిన ముమైత్ ఖాన్.. ఒకప్పుడు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా గెలిచింది. అయితే హీరోయిన్లు ఎప్పుడైతే స్పెషల్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశారో.. అప్పటి నుంచి ముమైత్ ఖాన్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.
వెండితెరపై ముమైత్ కనిపించి చాలా కాలమే అయింది. అయితే బుల్లితెరపై అడపా తడపా టీవీ షోస్‌లో కనిపిస్తున్న ముమైత్.. ప్రస్తుతం బిజినెస్ పై తన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే బ్యూటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రంగంలోకి ముమైత్ ఖాన్ ఎంటర్ అయింది. `వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ` పేరుతో హైదరాబాద్ యూసుఫ్‌గూడలో తన తొలి బ్రాంచ్ ను ఆమె ప్రారంభించారు.