‘జీవీరెడ్డి’ని ఎగదోసింది..ఆడిటరా?

admin
Published by Admin — February 27, 2025 in Politics, Nri
News Image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ ‘జివి రెడ్డి’ రాజీనామా వెనుక ఓ ఆడిటర్‌ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

హఠాత్తుగా ‘జీవీరెడ్డి’ రాజీనామా చేయడం వెనుక సదరు ఆడిటర్‌ ఉన్నారని, ఆయన ఎగదోయడంతోనే..‘జీవీరెడ్డి’ చిక్కుల్లోకి వెళ్లారని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఈ ఆడిటర్‌ ఓ కీలకమైన మంత్రికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.

సదరు మంత్రి పేషీలో అంతా తానైనడిపిస్తోన్న సదరు ఆడిటర్‌..‘జీవీ’ని ‘చంద్రబాబు’కు వ్యతిరేకంగా ప్రోత్సహించారని, ‘చంద్రబాబు’ను బెదిరించమని, ఆయనను బెదిరిస్తే..ఏమీ కాదని, ‘చంద్రబాబు’ భయస్తుడని, ఆయన ఏమీ చేయరని, తిరుగుబాటుచేస్తే..పార్టీలో ‘హీరో’ వర్షిప్‌ వస్తుందని ఆయనను ఎగదోశారని తెలుస్తోంది.

గత కొన్నాళ్లుగా ఈ ఆడిటర్‌ ప్లస్‌ నాయకుడు ‘జీవీరెడ్డి’తో నిత్యం టచ్‌లో ఉంటున్నారు.

వీరిద్దరూ ఆడిటర్లు కావడం..అదీ ఒకే పార్టీ వారు కావడంతో..వారిద్దరి మధ్య మరింతగా సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి.

నామినేటెడ్‌ పదవులప్పుడు కూడా ‘జీవీరెడ్డి’ని రెచ్చగొట్టింది..అతనేనని, అప్పట్లో ‘చంద్రబాబు’ ‘పిఎస్‌’ను ‘జీవీరెడ్డి’ లక్ష్యంగా చేసుకుని బహిరంగ విమర్శలు చేసినా..‘చంద్రబాబు’ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఆయనేమీ చేయరని, రచ్చ..రచ్చ చేస్తే ఆయనే దిగివస్తారని ‘జీవీరెడ్డి’కి ఎక్కించింది ఈ ఆడిటరేనని ‘టిడిపి’ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

‘జీవీరెడ్డి’ని బూచిగా చూపి సదరు నేత తన పనులు చేసుకుంటున్నారని, ఇటీవల కాలంలో ఓ నియామకం వెనుక ఆయన ఉన్నారని, ఆయన ఒత్తిడి వల్లే ఆ నియామకం జరిగిందంటున్నారు.

సదరు ఆడిటర్‌ ఎత్తులకు గతంలో కొందరు ‘టిడిపి’ సీనియర్‌ నేతలు బలయ్యారు.

అంతేనా రాజధాని ప్రాంతంలోని ఓ టీడీపీ మాజీ ఎమ్మెల్యేను ఇతను రకరకాలుగా బెదిరించి..సొమ్ములు నొక్కేసారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడు ఓ కీలక మంత్రి, మరో సీనియర్‌ ఎమ్మెల్యే, తెలంగాణకు చెందిన ఓ మాజీ ‘ఆంధ్రజ్యోతి’ జర్నలిస్టు, ‘సాక్షి’ ప్రతినిధులు అంతా ఒక గ్రూప్‌గా ఉంటారు.

తాము టార్గెట్‌ చేసిన నేతను వీళ్ల రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసి బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తారనే ప్రచారం ఉంది.

ఇటువంటి వారితో ‘జీవీరెడ్డి’కి సాన్నిహిత్యం నెలకొనడంతో..వారి ప్రభావం ఆయనపై భారీగానే పడిరదంటున్నారు.

ఇటీవల కాలంలో ‘జీవీరెడ్డి’ వ్యవహారశైలి కూడా పూర్తిగా మారిందంటున్నారు.

కొందరు ‘టిడిపి’ నేతలు ఆయనను ‘ఆంధ్రా రేవంత్‌రెడ్డి’ అని సంబోధిస్తున్నారట. వారు ఆ మాటలతో పిలిస్తే..ఆయన ఉప్పొంగిపోతున్నారట.

అలా పిలిపించుకోవడానికే..ఆయన పార్టీ అధినేత ‘చంద్రబాబు’ను ఎదిరిస్తున్నారని, మొదటిసారి చూసీ చూడనట్లు వదిలేసిన ‘చంద్రబాబు’ ఈసారి మాత్రం కొరఢా ఠుళిపించారు. అధినేత కొరఢా రaళిపించడంతో..ఆయనను ఎగదోసిన నేతలు ‘జీవీరెడ్డి’కి మొహం చాటేశారనే ప్రచారం సాగుతోంది

వాస్తవానికి ‘జీవీరెడ్డి’ లేవనెత్తిన 400 మంది వైకాపా ఉద్యోగులు కేవలం ఫైబర్‌నెట్‌లోనే కాదు.

ఇతర శాఖల్లోనూ వందలాది మంది ఉన్నారు. ఉదాహరణకు రాష్ట్ర సమాచారశాఖను తీసుకుంటే ‘జగన్‌’ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాచారశాఖ కార్యాలయాల్లో పిఆర్‌ఓలను నియమించారు.

వారిని ఇప్పటి వరకూ బయటకు పంపించలేదు.

అదే విధంగా ఇప్పటికీ కొందరు మంత్రుల వద్ద పాత మంత్రుల వద్ద పిఆర్‌ఓలుగా పనిచేసినవారే ఇప్పుడూ పనిచేస్తున్నారు.

ఇదొక్కడేనా..‘ఆరోగ్యశ్రీ’లో కనీసం 350 మందిని ‘జగన్‌’ అక్రమంగా నియమించారు.

వీరు కాకుండా మైనింగ్‌, ఎక్సైజ్‌, పంచాయితీరాజ్‌, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిశాఖలోనూ వైకాపా హయాంలో నియమించిన వారు వందల మంది ఉన్నారు.

మరి ఆయా శాఖల మంత్రులు, ఛైర్మన్లు ఇలానే బహిరంగంగా మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని నిందిస్తారా..? ‘జీవీరెడ్డి’ లేవనెత్తిన సమస్య సమంజసమైందే..ఎండి ‘దినేష్‌కుమార్‌’ చర్యలను తప్పు పట్టాల్సిందే…కానీ..దానికో పద్దతి ఉంటుంది. అంతా వదిలేసి..ఎవరో ప్రోత్సహిస్తేనో..లేక తనను తాను ఎక్కువగా ఊహించుకుంటేనో..ఇటువంటి సమస్యలు వస్తాయి. యువకుడైన ‘జీవీరెడ్డి’ ఇప్పటికే మూడు పార్టీలు మారారు. తొలుత ‘కాంగ్రెస్‌’ తరువాత ‘వైకాపా’ ఇప్పుడు ‘టిడిపి’ ఇలా పార్టీలు మారుకుంటూ వెళితే..ఆయన ఎంత నిజాయితీపరుడైనా, పనిమంతుడైనా..ఆయన క్రెడిబులిటీ పోతుంది.

Tags
GV Reddy was kicked out..the auditor...!?
Recent Comments
Leave a Comment

Related News