రాజ‌మౌళి టార్చ‌ర్‌.. ఆత్మ‌హ‌త్య‌కు సిద్ధ‌మైన స్నేహితుడు.. చిక్కుల్లో డైరెక్ట‌ర్‌!

admin
Published by Admin — February 27, 2025 in Movies
News Image

తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ‌స్థాయికి చాటిచెప్పిన‌ ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి చిక్కుల్లో ప‌డ్డారు. రాజ‌మౌళి స్నేహితుడు యు. శ్రీనివాసరావు ఆయ‌న‌పై తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని.. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో, లెటర్ విడుదల చేశాడు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు.. త‌న సెల్ఫీ వీడియో, లెటర్‌ ఆధారంగా అత‌నిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేడ‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

`ఇండియాస్‌ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి మరియు రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం ఇది . నేను పబ్లిసిటీ కోసం ఇలా చేయడం లేదు. పబ్లిసిటీ చేసుకునే వాడెవడు చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. ఎం. ఎం. కీరవాణి, గుణ్ణం గంగరాజు, చంద్రశేఖర్ ఏలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీస్ చెర్రీ ఇలా చాలామందితో కలిసి నేను పనిచేశాను. వీళ్ళందరికీ రాజ‌మౌళితో నా స్నేహం గురించి తెలుసు. 1990 నుంచి మేమిద్దరం స్నేహితులం. మాది 34 ఏళ్ల ఫ్రెండ్షిప్. రామాయణం మహాభారతం ఒక మహిళ వల్ల జ‌రిగాయంటే ఏమో అనుకున్నాను.

కానీ ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. అందరి జీవితాల్లో మాదిరి మా లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది. ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం.. ఆ తర్వాత నాతో కూడా స్నేహం ఏర్పడింది. ఆర్య 2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాది. మేము ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దామ‌ని నేనే రాజమౌళిని అడిగాను. ఆ అమ్మాయిని వదిలేయమని రాజమౌళి నన్ను కోరాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. ముగ్గురు కలిసే ఉందామంటే.. రాజమౌళి చాలా చండాలంగా ఉంటుందని అన్నాడు. చివరకు నేనే ఆమెను వదులుకున్నాను.

ఇదంతా శాంతినివాసం సీరియల్ కు ముందు జరిగిన విషయం. ఇంతవరకు బాగానే ఉన్నా నెంబర్ వన్ డైరెక్టర్ గా రాజమౌళి ఎప్పుడైతే ఎదగాడో.. అప్పటి నుంచి వాడిలో అనుమానం మొదలైంది. మా మధ్య జరిగిన విషయాలన్నీ నేను ఎవరికైనా చెప్పేస్తానేమోనని గొడవలు మొదలెట్టాడు. ఒకరోజు కోపంలో మన ట్రయాంగిల్ స్టోరీని సినిమాగా తీస్తానని నేను అన్నందుకు.. టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. వాడి పిల్లలను నేను దగ్గరుంటే పెంచాను. కానీ ఇప్పుడు రాజమౌళి కుటుంబం మొత్తం నాకు దూరం అయ్యారు.

ఇప్పుడు నాకు 54 ఏళ్లు. పెళ్లి కూడా చేసుకోలేదు. సింగిల్ గానే ఉంటున్నాను. వాడి వల్ల నా జీవితం నాశనమైంది. వాడిని నేను ఏ విషయంలో డిస్టర్బ్ చేయలేదు. కానీ ఈ రహస్యాలన్నీ అందరికీ చెప్పాన‌నుకుని నన్ను చ‌చ్చేలా టార్చర్ చేస్తున్నాడు. ఇదంతా మా ముగ్గురి మధ్య జరిగింది. ఇందుకు సాక్షాలు ఏమి లేవు. నేను చనిపోతున్నాను. ఆ తర్వాత అయినా రాజ‌మౌళికి లైవ్‌ డిటెక్టర్ టెస్ట్ చేయండి. అసలు విషయం తెలుస్తుంది. ఇవన్నీ నా మరణ వాంగ్మూలంగా తీసుకోవాలని రాజ‌మౌళిపై సుమోటో కేసు న‌మోదు చేయాల‌ని కోరుతున్నాను` అంటూ వీడియోలో శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. శ్రీ‌నివార‌రావు చేసిన ఆరోప‌ణ‌లు ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియ‌దు గానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం సంచ‌ల‌నంగా మారాయి. మ‌రి ఈ విష‌యంపై రాజ‌మౌళి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags
director rajamouli Latest news Rajamouli
Recent Comments
Leave a Comment

Related News