నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నుంచి మరో మాస్ అండ్ పవర్ అప్డేట్ వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్‌గా రూపుదిద్దుకుంటున్న 'NBK112' ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్లో గాయపడటం, ఆ తర్వాత సర్జరీ జరగడంతో గత కొద్ది రోజుల నుంచి విశ్రాంతి తీసుకున్న బాలయ్య, పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ మొదటి వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా ఫస్ట్ షెడ్యూల్లో ప్లాన్ చేసిన హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌లోనే బాలయ్య(Balayya) సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన లుక్ , స్టైల్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.
కేవలం యాక్షన్ ఎంటర్టైనర్గానే కాకుండా, ఇందులో బలమైన కుటుంబ భావోద్వేగాలతో పాటు ప్రస్తుత రాజకీయ నేపథ్యాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారట. 'దేవర' వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ ఈ కథపై ప్రత్యేకంగా కసరత్తు చేసి, మరింత పకడ్బందీగా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ (SVC) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరికొత్త కథాంశంతో, మాస్ అండ్ పొలిటికల్ టచ్‌తో రాబోతున్న ఈ సినిమాను 2027 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి బాలయ్య బాబు - కొరటాల శివ(Koratala Shiva) కాంబో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.