పేద బ్రాహ్మణ కుటుంబాలకు అండగా ‘గరుడ దహన సంస్కారాల’ పథకం పునఃప్రారంభం: ఏపీబీడబ్ల్యూసీ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్

admin
Published by Admin — September 25, 2026 in Andhra
News Image

పేద బ్రాహ్మణ కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పించే ‘గరుడ దహన సంస్కారాల’ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించడం పట్ల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కె. బుచ్చి రామ్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేద బ్రాహ్మణ కుటుంబాలకు దహన సంస్కారాల కోసం రూ.10,000 ఆర్థిక సహాయం అందించనున్నారు.

పేద కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాద సమయంలో ఆర్థిక ఇబ్బందులతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి రాకూడదనే మానవతా దృక్పథంతో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించడం కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అలాగే ఎండోమెంట్స్ శాఖ మంత్రి శ్రీ అనం రామనారాయణరెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

“పేద బ్రాహ్మణ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవాలనే సంకల్పంతో గరుడ దహన సంస్కారాల పథకాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయం. రూ.10 వేల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఆ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. ప్రభుత్వం తమకు అండగా ఉందనే భరోసా” అని చైర్మన్ అన్నారు.

గరుడ దహన సంస్కారాల పథకం పునఃప్రారంభంపై కార్పొరేషన్ డైరెక్టర్లతో చైర్మన్ శ్రీ కె. బుచ్చి రామ్ ప్రసాద్ గ్రూప్ కాల్ ద్వారా మాట్లాడి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు కూడా పథకాన్ని పునఃప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, ఎండోమెంట్స్ మంత్రి శ్రీ అనం రామనారాయణరెడ్డి గారికి, కూటమి ప్రభుత్వానికి మరియు చైర్మన్ శ్రీ కె. బుచ్చి రామ్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

పేదల సంక్షేమమే లక్ష్యంగా.. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని డైరెక్టర్లు పేర్కొన్నారు.

బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా డైరెక్టర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని చైర్మన్ సూచించారు.

“కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. గరుడ దహన సంస్కారాల పథకం పునఃప్రారంభం అందుకు మరో నిదర్శనం. అర్హులైన ప్రతి పేద బ్రాహ్మణ కుటుంబానికి ఈ సహాయం అందేలా కార్పొరేషన్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది” అని చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు.

Tags
Garuda dahana samskara pathakam restarted in ap says APBWC Chairman buchi ram Prasad
Recent Comments
Leave a Comment

Related News