విశాఖలో బే టెక్ సిటీ

admin
Published by Admin — November 22, 2026 in Andhra
News Image
ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. హైటెక్ సిటీ పేరు తెలియని ఐటీ ఉద్యోగి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇదంతా టిడిపి అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు విజన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. వైటూకేతో ప్రపంచమంతా సతమతమవుతుంటే విజన్ 2020 అంటూ రాబోయే 20 ఏళ్లలో ఐటీరంగం సాధించబోయే అభివృద్ధిని ఆనాడే అంచనా వేసిన దార్శనీకుడు చంద్రబాబు.
 
అటువంటి చంద్రబాబు ఏపీలో కూడా సైబరాబాద్ తరహా ఐటీ హబ్ పై ఫోకస్ చేశారు‌. హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలోనే విశాఖలో 'విశాఖ బే టెక్ సిటీ' ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ లో ఏర్పాటు చేస్తున్న యాంకర్ ప్రాజెక్టుకు ఆ పేరు పెట్టారు. చంద్రబాబు అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ బే టెక్ సిటీని డెవలప్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Tags
high tech city bay tech city vizag IT Hub
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News