యువత రీల్స్‌కు సమయం ఎక్కువగా వెచ్చిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రీల్స్‌కు వెచ్చించే సమయాన్ని మరింత పరిజ్ఞానం.. బిల్డింగ్ కెపాసిటీకి వినియోగించాలని ఆయన సూచించారు. తద్వారా జీవితంగా ఎదిగేందుకు ఆదాయం సంపాయించుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఇక, ప్రభుత్వ పాలన గురించి వివరిస్తూ.. ``రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ఎప్పటికప్పుడు పాలనా వ్యవహారాలను, పౌరసేవల నాణ్యతను పర్యవేక్షిస్తున్నాం. డేటా లేక్ లాంటి వ్యవస్థలు, ఇ- ఫైళ్ల విధానం ద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం`` అని చంద్రబాబు చెప్పారు..
కీ పెర్ఫార్మెన్సు ఇండి కేటర్లను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో సూచనలు జారీ చేస్తున్నామన్ని, `ఐ గాట్ కర్మయోగి పోర్టల్` ద్వారా 2 కోట్ల కోర్సులను పూర్తి చేసి ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. ఉద్యోగులు, ప్రభుత్వ యంత్రాంగం లేకుండా ఏ ప్రకృతి విపత్తును ఎదుర్కోలేమన్న సీఎం పండుగలైనా, కార్యక్రమాలైనా ఉద్యోగులే కీలకమని వ్యాఖ్యానించారు. అందుకే వారి సామర్ధ్యాలను పెంచేలా, నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా ఈ శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నామని చంద్రబాబు చెప్పారు.
రీల్స్ కంటే కెపాసిటి బిల్డింగ్ కోసం సమయం వెచ్చిస్తే మన వ్యక్తిగత నైపుణ్యాలను పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని యువతకు సూచించారు. ప్రజలకు అందించే సేవల నాణ్యత పెరగాలంటే టెక్నాలజీని, విధానాలను అనుసంధానిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య నిరంతరాయంగా సమాచార పంపిణీ జరగాలని, అప్పుడే వేగంగా నిర్ణయాలు తీసుకోగలమని చెప్పారు. సంక్షోభంగా మారకముందే మనం సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించేలా నైపుణ్యాలు పెరగాలని సూచించారు.
పీ4 లాంటి కార్యక్రమాల ద్వారా జీవన ప్రమాణాలను పెంచటం సాధ్యం అవుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రాం తాలు, భాషలు, సంస్కృతులూ వేరైనా దేశంగా మన అందరి లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. వచ్చే 20 ఏళ్లలో భారత్ అగ్రస్థానానికి ఎదగాలని, దానికి అనుగుణంగా మనం అంతా కలిసి పనిచేయాలని కోరుతున్నానని చెప్పారు. గతం లోనే ఉమ్మడి ఏపీలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ద్వారా అధికారులు ఉద్యోగుల్లో సామర్ధ్యాలు పెంచేందుకు కృషి చేశామని గుర్తు చేశారు.