వైసీపీకి చాణక్య సర్వే షాక్!

admin
Published by Admin — September 30, 2026 in Andhra
News Image

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. అనే అంశంపై ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌.. `చాణక్య స్ట్రాటజీస్` కీల‌క సర్వే చేసింది. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని తాజాగా విడుద‌ల చేసింది. చాణ‌క్యస్ట్రాట‌జీస్ సంస్థ‌కు విశ్వ‌స‌నీయ‌త ఉండ‌డంతోపాటు.. దేశ‌వ్యాప్తంగా కూడా బ‌ల‌మైన నెట్ వ‌ర్క్ ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ సంస్థ ఇచ్చే స‌ర్వే రిపోర్టుకు ప్ర‌జ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.

తాజాగా ఏపీ రాజ‌కీయాల‌పై చాణ‌క్య స్ట్రాట‌జీస్ చేసిన స‌ర్వేలో 175 నియోజకవర్గాల్లో 52,500 మంది అభిప్రాయాలు సేకరించింది. దీంతో మ‌హిళ‌లు, పురుషులు కూడా ఉన్న‌ట్టు స‌ర్వే సంస్థ వెల్ల‌డంచింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయమ‌ని పేర్కొంది. టీడీపీ 46.9% ఓట్ షేర్ సాధించే అవకాశం ఉందని స‌ర్వే సంస్థ వెల్ల‌డించింది. ఇక‌, ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా విజ‌యం త‌మ‌దేన‌ని చెబుతున్న వైసీపీకి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్టు స‌ర్వే వెల్ల‌డించింది.

వైసీపీకి ఈ స‌ర్వేలో.. 35% మంది మాత్ర‌మే అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అంటే.. వైసీపీ ఓట్ షేర్ 35 శాతానికి ప‌డిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో అంటే.. 2024లో వైసీపీకి 48-49 శాతం ఓటు షేర్ ల‌భించ‌డం గ‌మ‌నార్హం. కానీ, ఈ రెండున్న‌రేళ్ల‌లో వైసీపీ డౌన్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న జనసేన పార్టీకి కూడా ప్ర‌జ‌లు మొగ్గు చూశారు. ఈ పార్టీకి 9% ఓట్ షేర్ సాధిస్తుందని స‌ర్వే అంచనా వేసింది. ఏపీలో బీజేపీకి 3.5% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంద‌ని తెలిపింది. కాంగ్రెస్ స‌హా క‌మ్యూనిస్టులు, ఇతరులకు 5.6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంద‌ని చాణ‌క్య పేర్కొంది.

ఎలా సాధ్యం?

ప్ర‌జ‌లు ఈ స‌ర్వేలో విశ్వ‌సించిన అంశాలు.. 5 ఉన్నాయ‌ని చాణ‌క్య తెలిపింది 1) చంద్ర‌బాబు స‌హా కూట‌మి స‌ర్కారుపై విశ్వ‌స‌నీయ‌త‌., 2) రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం. 3) పెట్టుబ‌డులు, ఉద్యోగ అవ‌కాశాలు పెంపు. 4) స్థిర‌మైన నాయ‌క‌త్వం.. దూర‌దృష్టితో కూడిన పాల‌న‌. 5) సంక్షేమం. ఈ ఐదు అంశాల ఆధారంగా టీడీపీ, జ‌న‌సేన స‌హా కూట‌మి వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది. 

Tags
Chanakya survey predicts TDP's win in AP Ycp
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News