ఏపీ విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ఎంత బిజీగా ఉన్నా సరే టీడీపీ సోషల్ మీడియా విభాగంపై ఆయన స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఈ క్రమంలోనే టీడీపీ ఐటీ వింగ్ (ఐటీడీపీ)పై ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఐటీడీపీ ఒక వారధిగా ఉండాలని అన్నారు. వ్యక్తులు కాదు, వ్యవస్థే ప్రధానమన్న లక్ష్యంతో పనిచేయాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని చెప్పారు. అసత్య ప్రచారాలను ఆధారాలతో సహా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. ఐటీడీపీ కమిటీల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని లోకేశ్ ఆదేశించారు. ప్రతి సభ్యుడిని 'మై టీడీపీ యాప్'తో అనుసంధానించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకే తమ ప్రభుత్వం కట్టుబడి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళతామని తెలిపారు.