మ‌హిళ‌ల‌పైనా రేప్ కేసులు పెట్టుకోవ‌చ్చు!

admin
Published by Admin — October 17, 2026 in National
News Image

ఇదేంటి చిత్రం అనుకుంటున్నారా?.. నిజ‌మే. మ‌హిళ‌ల‌పై కూడా అత్యాచార కేసులు పెట్ట‌వ‌చ్చ‌ని ఢిల్లీహైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. నిజానికి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు పురుషుల‌పైనే అత్యాచార కేసులు పెడుతున్నారు. దీనికి సంబంధించి పోక్సో స‌హా.. నిర్భ‌య వంటి ప్ర‌త్యేక చ‌ట్టాల‌ను కూడా చేశారు. మ‌రి అలాంటిది మ‌హిళ‌ల‌పై కేసులు ఏమిటి? వారు కూడా రేప్ చేస్తారా? అనే సందేహాలు వ‌స్తాయి. స‌హ‌జంగా రేప్ కేసుల్లో నూటికి నూరు శాతం బాధితులు మ‌హిళ‌లే!. ఈ విష‌యంలో తేడా లేదు.

కానీ, ఇటీవ‌ల దేశంలో వెలుగు చూస్తున్న అనేక ఘ‌ట‌న‌ల్లో.. మ‌హిళలు కూడా రేప్ కేసుల‌ను ప్రోత్స‌హిస్తున్నారని పోలీసులు గుర్తించారు. సామూహిక అత్యాచారం చేసేందుకు త‌మ నివాసాల‌ను ఇవ్వ‌డం.. అలానే సామూహిక అత్యాచారాల విష‌యంలో స‌హ‌క‌రించ‌డం.. మ‌హిళ‌ల‌ను ప్ర‌లోభ పెట్టి.. యువ‌త‌కు అప్ప‌గించ‌డం వంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా ఇలాంటి కేసుల‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌పై కూడా అత్యాచారం.. పోక్సో, నిర్భ‌య వంటి చ‌ట్టాల కింద కేసులు న‌మోదు చేయొచ్చ‌ని తీర్పు వెలువ‌రించింది.

ఇలా.. మ‌హిళ‌ల‌పై రేప్ కేసులు, సంబంధిత చ‌ట్టాల కింద ఎఫ్ ఐఆర్‌లు న‌మోదు చేయాల‌ని ఆదేశించ‌డం దేశంలో ఇదే తొలిసారి. విష‌యానికి వ‌స్తే.. ఢిల్లీకి చెందిన ఓ గృహిణిపై గ‌త ఏడాది సామూహిక అత్యాచారం జ‌రిగింది. దీనిలో నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. వీరిలో ఓ మ‌హిళ కూడా ఉంది. ఆమెపై కూడా ఢిల్లీ పోలీసులు.. అత్యాచారం సెక్ష‌న్ కింద కేసు పెట్టారు. నిజానికి మ‌హిళ‌-మ‌హిళ‌ను అత్యాచారం చేయ‌డం.. సెక్స్ చేయ‌డం వంటివి జ‌ర‌గ‌వు. ఇదే లాజిక్‌తో స‌ద‌రు నిందితురాలు.. హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

``అయ్యా నాదేం లేదు. ఈ కేసు నుంచి విముక్తి క‌ల్పించండి``-అని హైకోర్టును వేడుకున్నారు. అయితే.. కోర్టు మాత్రం.. పోలీసుల‌ను స‌మ‌ర్థించింది. సామూహిక అత్యాచారం కేసుల్లో మహిళలను నేరస్తులుగా గుర్తించ‌వ‌చ్చ‌ని తెలిపింది. రేప్ చేయాల‌న్న‌ ఉద్దేశంతో ఒక్కరు లేదా ఎక్కువమంది కలిసి నేరానికి పాల్పడటాన్ని, దానికి మ‌హిళ‌లు స‌హ‌క‌రించ‌డాన్ని వేర్వేరుగా చూడ‌లేమ‌ని పేర్కొంది. మహిళలకు మినహాయింపు ఏమీ లేదని తెలిపింది. భౌతికం గా లైంగికదాడికి పాల్పడకపోయినా.. సహ నిందితులను ప్రోత్సహించటం, సాయం చేయటం కూడా అత్యాచారం కింద‌కే వ‌స్తుంద‌ని తేల్చి చెప్పింది.

Tags
Rape case can be filed on women too says Delhi High court
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News