సీఎం సంచలన నిర్ణయం

admin
Published by Admin — November 25, 2026 in National
News Image
ఇది కలికాలం... నవమాసాలు మోసి, అష్ట కష్టాలు పడి తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పిల్లలు అనాధాశ్రమాల్లో వదిలేస్తున్న కఠినమైన కాలం. ఎంత పెద్ద చదువులు చదివించినా సరే కనీస కృతజ్ఞత లేకుండా కన్న తల్లిదండ్రులను కన్నీరు పెట్టిస్తున్న కసాయి పిల్లలు ఉన్న కాలం. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు రాయించుకొని వారిని నడిరోడ్డు మీద నిలబెడుతున్న ఘనులున్న కాలం. అయితే, ఇకపై అటువంటి వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా కేరళం ప్రభుత్వం చట్టం చేసింది.

తల్లిదండ్రుల ఆస్తులు రాయించుకొని ఆ తర్వాత వారిని పట్టించుకోకుండా గాలికి వదిలేసే పిల్లలకు బుద్ధి చెప్పేందుకు కేరళ సీఎం వీ.డీ సతీషన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటువంటి బాధ్యతారహితమైన పిల్లలకు మూడేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకు వచ్చామని ఆయన ప్రకటించారు. సీనియర్ సిటిజన్ సంరక్షణ హక్కుల పరిరక్షణ కోసం అసెంబ్లీలో గత అక్టోబర్ లో ఆమోదించిన నూతన బిల్లులో ఈ కీలక నిబంధనలను చేర్చామని చెప్పారు.

కొల్లం సమీపంలో పతనపురంలో ఉన్న గాంధీభవన్లో 20 కోట్ల రూపాయల ఖర్చుతో వృద్ధుల కోసం అత్యాధునిక వసతులతో నిర్మించిన పితృ మందిరం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా వయోవృద్ధుల కోసం విశేష హక్కులు కల్పిస్తూ ఈ చట్టాన్ని తెచ్చామని అన్నారు. గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందని చెప్పారు.
Tags
Keralam CM V.D.Satishan new act parents caring 3 years imprisonment
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News