ఆళ్లగడ్డ మున్సిపాలిటీ టిడిపి కైవసం!

admin
Published by Admin — October 22, 2026 in Politics
News Image

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా షేక్ అనీషా(టీడీపీ) ఏక్రగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మున్సిపాలిటీలో ప‌రిధిలో 32 వార్డులు ఉండ‌గా.. ఇవ‌న్నీ కూడా ఏకగ్రీవమైనట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. అలానే.. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో టీడీపీ 22, వైసీపీ 8, జనసేన 2 వార్డులు కైవసం చేసుకున్న‌ట్టు తెలిపారు.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా తొలి ఏకగ్రీవం..న‌మోదైంది. 4వ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి ఏకగ్రీవంగా టీడీపీ నాయ‌కురాలు వీరమాచినేని లలిత విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ప‌రిధిలోని నందిగామ మున్సిపల్ ఎన్నికల పోరులో కూటమి తొలి బోణీ కొట్టింది. 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి స్వచ్ఛందంగా వైదొలగడంతో కూటమి అభ్యర్థి మ‌రీదు పద్మజకు మార్గం సుగమం అయింది. ఆమె కూడా ఏకగ్రీవంగా విజ‌యం ద‌క్కించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యర్రబడి అంజన పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నారు.  

ఇక‌, అనంత‌పురంలో టీడీపీకి ఏక‌గ్రీవాలు ఎక్కువ‌గా క‌నిపించాయి. జిల్లాలోని గుత్తి మునిసిప‌ల్ చైర్మ‌న్‌పీఠం టీడీపీకి ద‌క్కింది. 32 వార్డుల‌కు గాను 27 వార్డులు టీడీపీ నాయ‌కులు ఏక‌గ్రీవంగా గెలుచుకున్నారు. అదేవిధంగా తాడిప‌త్రి మునిసిపాలిటీలోనూ టీడీపీ ఏక‌గ్రీవాలు సాధించింది. రాజ‌కీయంగా తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసే ఈ ప్రాంతంలో 48 వార్డుల‌కు గాను 30 వార్డులు ఏక‌గ్రీవం అయిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను అనుస‌రించి నిర్ణ‌యం ఉంటుంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇక‌, శ్రీస‌త్య‌సాయి జిల్లాలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

హిందూపురం మునిసిపాలిటీలో 7, 11 వార్డులు, మ‌డ‌క‌శిర మునిసిపాలిటీలో 7వ వార్డును టీడీపీ ఏక‌గ్రీవంగా త‌న ఖాతాలో వేసుకుంది. చైర్మ‌న్ స్థానాల‌కు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నుంచే ఎక్కువ మంది నాయ‌కులు నామినేష‌న్లు వేయ‌గా.. చివ‌రి నిముషంలో బుధ‌వారం వారు వాటిని ఉప‌సంహ‌రించుకున్నారు. సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో 51 వార్డుల్లో టీడీపీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. టీడీపీ 48., జ‌న‌సేన 1, బీజేపీ 1 ఏక‌గ్రీవంగా గెలుచుకున్నాయి. అయితే.. చిత్రంగా వైసీపీ కూడా ఒక స్థానాన్ని ఏక‌గ్రీవంగా గెలుచుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. అలాగే మాజీ మంత్రి రోజాకు చెందిన న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ ఏక‌గ్రీవాలు సాధించ‌డం గ‌మ‌నార్హం.

Tags
TDP won allagadda municipality
Recent Comments
Leave a Comment

Related News