17 ఏళ్లకే ప్రేమ.. 7 ఏళ్లు పెద్దవాడు.. కీర్తి సురేశ్‌ లవ్ స్టోరీ ఇదా..?

admin
Published by Admin — November 05, 2026 in Movies
News Image

వెండితెరపై తన అల్లరి చూపులు, సహజమైన నటనతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన అందాల తార కీర్తి సురేశ్‌(Keethy Suresh) వ్యక్తిగత జీవితం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అందరూ ఆమె సినిమాల గురించే మాట్లాడుకుంటుంటే, ఆమె మాత్రం తన రియల్ లైఫ్ లవ్ స్టోరీకి సంబంధించిన కొన్ని ఊహించని నిజాలను బయటపెట్టింది. అసలు ఆంటోనీ తట్టిల్‌తో కీర్తి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? ఆ ప్రేమ ప్రయాణంలో ఆమె ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? అనే విషయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

కీర్తి సురేశ్‌, ప్రముఖ వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్(Antony Thattil) మధ్య ప్రేమకథ అనుకున్నదానికంటే చాలా ముందే అంటే 2010 జనవరిలోనే అంకురార్పణ జరిగిందట. అప్పట్లో కీర్తి వయసు కేవలం 17 ఏళ్లే కావడం విశేషం. ఇక ఆంటోనీ వయసు ఆమెకంటే ఏడేళ్లు పెద్దవాడు. ఆమె హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే వీరి పరిచయం ప్రేమగా మారింది. ఒకే వయసులో కాకుండా ఏడేళ్ల తేడా ఉన్నప్పటికీ, ఇద్దరూ కలిసి మెరుగైన అవగాహనతో పెరిగారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఈ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలని గట్టి నిర్ణయానికి వచ్చారు.

అయితే, ఈ ప్రేమ ప్రయాణం అంత సులువుగా సాగలేదట. వీరిద్దరి మతాలు వేర్వేరు కావడంతో ఇంట్లో పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. క్రిస్టియన్ అయిన ఆంటోనీని వివాహం చేసుకోవడానికి కీర్తి తన కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు సుదీర్ఘ సమయమే పట్టవలసి వచ్చింది. ఇంట్లో రకరకాల సమస్యలు, చర్చలు నడిచినా.. వారిద్దరి మధ్య ఉన్న గాఢమైన నమ్మకం చివరికి పెద్దల అంగీకారాన్ని తెచ్చిపెట్టింది. చివరికి అన్ని అడ్డంకులను దాటుకుని గతేడాది డిసెంబర్‌లో గోవా వేదికగా హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం సోషల్ మీడియాలో ఒకే ఒక్క ఫోటోతో అందరికీ షాకిచ్చిన కీర్తి(Keerthy), ఇప్పుడు తన ప్రేమకథలోని అసలు మలుపులను ఇలా రివీల్ చేసి అభిమానులకు అసలు సిసలు సర్ప్రైజ్ ఇచ్చింది.

Tags
Keerthy Suresh Keerthy Suresh Love Story Antony Thattil TollywoodN Kollywood Keerthy Suresh Movies
Recent Comments
Leave a Comment

Related News