వైసీపీకి 10 శాతం అవుట్‌..!

admin
Published by Admin — November 05, 2026 in Politics
News Image

``మ‌న ఓటు బ్యాంకును ఎవ‌రూ చెరిపేయ‌లేరు. మ‌నం 40 శాతం పైగా ఓటు బ్యాంకును కొన‌సాగిస్తున్నాం. దీనిని కొంచెం పెంచుకుంటే చాలు.. ప్ర‌జ‌లు మొత్తం మ‌న‌తోనే ఉంటారు`` -ఇదీ.. స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఆ పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పిన విష‌యం. నిజ‌మే. ఆయ‌న ఆశ‌లు, అంచ‌నాల్లో త‌ప్పులేదు. ఎందుకంటే.. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్ల‌కు ప‌డిపోయిన‌ప్పుడు కూడా.. 40 శాతం ఓటు బ్యాంకును పదిలంగా కాపాడుకుంది.

ఇదే ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంద‌ని జ‌గ‌న్ అంచ‌నా వేసుకున్నారు. కానీ.. తాజా ఎన్నిక‌ల ఫ‌లితా లను గ‌మ‌నిస్తే.. అధికారిక గ‌ణాంకాలు రాక‌పోయినా.. వైసీపీ నేత‌లు వేస్తున్న లెక్క‌ల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌స్తుత ఎన్నిక ల్లో వైసీపీకి 26-32 శాతం మ‌ధ్య మాత్ర‌మే ఓట్లు పోల‌య్యాయి. బ‌ల‌మైన పోటీ ఇస్తామ‌ని భావించిన ప్రాంతాల్లోనూ వైసీపీ దాదాపు చేతులు ఎత్తేసింది. ముఖ్యంగా కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ స్థానికంలో ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. దీంతో కీల‌క‌మైన ఓటు బ్యాంకు పూర్తిగా గాడిత‌ప్పింది.

అంచ‌నాలే త‌ప్పు!

2024లో వ‌చ్చిన ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుంద‌ని జ‌గ‌న్ వేసుకున్న అంచ‌నాలే రాంగ్ అయ్యాయ‌న్న‌ది విశ్లేషకు లు చెబుతున్న మాట‌. అప్ప‌టికి ఇప్ప‌టికి మ‌ధ్య రెండున్న‌రేళ్లు గడిచాయి. అప్ప‌ట్లో వైసీపీ ఇచ్చిన ప‌థ‌కాలు.. సంక్షేమం లేదా.. అధికారంలో ఉన్న నేప‌థ్యంలో నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌బావం చూపించారు. కానీ, ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. పైగా.. వైసీపీ అమ‌లు చేసిన అన్ని సంక్షేమ ప‌థ‌కాల‌కుతోడు.. కొత్త‌గా ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణం, అన్న‌క్యాంటీన్లు వంటివాటి ద్వారా కూట‌మి స‌ర్కారు ప్ర‌జ‌ల మ‌నసును గెలుచుకుంది. ఫ‌లితంగా వైసీపీ ఓటు బ్యాంకు ఏకంగా 10 శాతం మేర‌కు కోత బ‌డింది.

అయితే..ఈ ప‌దిశాతం ఓట్లు వైసీపీకి ప‌డినా.. గెలిచే ప‌రిస్థితి కూడా అంతంత మాత్ర‌మేన‌ని అంటున్నారు. ఎందు కంటే.. బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిల‌ప‌లేక పోవ‌డం.. ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇక‌, కూట‌మి ఓటు బ్యాంకు స‌హా.. క్షేత్ర‌స్థాయిలో కొన్ని కొన్ని ప్రాంతాలు మిన‌హా.. అన్నిచోట్లా కూట‌మి ఐక్యంగా ఉండ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది. దీంతో వైసీపీ సానుకూల ఓట‌ర్లు బూతుల వ‌ర‌కు రాలేద‌న్న‌ది కూడా చ‌ర్చ ఉంది. వీరిని మొబిలైజ్ చేయ‌డంలోనూ వైసీపీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న పార్టీలోనూ వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా.. 2024తో పోల్చి చూసుకునే అంశంపై ఇక‌పైనైనా జ‌గ‌న్ మారాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. 

Tags
Ycp vote bank 10 percent loss
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News