కూట‌మిని గెలిపించిన కీల‌క అస్త్రాలివే.. !

admin
Published by Admin — November 09, 2026 in Politics, Andhra
News Image

స్థానిక ఎన్నిక‌లు(AP Local Elections) ముగిశాయి. ప‌రిష‌త్ ఎన్నిక‌లు కూడా అయిపోయాయి. ఆయా ఎన్నిక‌ల్లో బ్యాలెట్ ద్వారానే ప్ర‌జ‌లు త‌మ తీర్పు చెప్పారు. స్వేచ్ఛ‌గా వ‌చ్చి ఓటు వేశారు. ఈ క్ర‌మంలో కూట‌మి పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశాయి. కానీ, ఈ విజ‌యం వెనుక దాదాపు ఏడాదిపాటు పార్టీలు చేసిన కృషి ఉంది. గ‌త ఆరుమాసాలుగా టీడీపీ, జ‌న‌సేన‌లు చేసిన అంత‌ర్మ‌థ‌నంతో పాటు.. పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త‌, స‌మ‌న్వ‌యం వంటివి స్ప‌ష్టంగా క‌నిపించాయి. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల వేళ‌.. కూట‌మి పార్టీల ఉమ్మ‌డి ప్రెస్ మీట్లు కూడా ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేశాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ(TDP)-జనసేన-బీజేపీ అధికార కూటమి సాధించిన భారీ విజయానికి పలు కీలక రాజకీయ, వ్యూహాత్మక అంశాలు కలిసివచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ఏకపక్ష విజయం సాధించడంలో తోడ్పడిన ప్రధాన అంశాలను ప‌రిశీలిస్తే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే మూడు పార్టీల (టీడీపీ, జనసేన, బీజేపీ) అగ్రనాయకత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీటీసీ/ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో స్పష్టమైన ఒప్పందానికి వచ్చాయి. క్షేత్రస్థాయిలో ఓట్లు చీలిపోకుండా ఈ ఐక్యత ఎంతగానో ఉపయోగపడింది.

నాయకులు, కార్యకర్తల సమన్వయం కూడా పార్టీల‌కు దోహ‌ద‌ప‌డింది. గ్రామ, వార్డు స్థాయిల్లో మూడు పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు విభేదాలను పక్కనబెట్టి సమన్వయంతో ఒకరి అభ్యర్థులకు మరొకరు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అధికారంలో ఉండటం  మ‌రో ప్ల‌స్ పాయింట్‌. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకే ప్రజలు మొగ్గు చూపుతారు. 2024 సార్వత్రిక ఎన్నికల గెలుపు జోష్‌ను కొనసాగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, నిరుద్యోగుల కోసం డీఎస్సీ(DSC) భర్తీ, జాబ్ క్యాలెండర్, రాష్ట్ర అభివృద్ధి ఎజెండా ఓటర్లను ఆకర్షించాయి.

ఇక‌, మ‌రో కీల‌క అంశం.. స్థానికంగా మంచి పట్టు, సామాజిక సమీకరణాలు, ప్రజాదరణ ఉన్న నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేయడం కూటమికి ప్లస్ అయింది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సంస్థాగత బలహీనత కూడా కూట‌మికి క‌లిసి వ‌చ్చింది. గత సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కేడర్‌ను తిరిగి బలోపేతం చేయడంలో ఇబ్బందులు పడటం, పలు ప్రాంతాల్లో సరైన పోటీ ఇవ్వలేకపోవడం కూడా కూటమికి ఏకపక్షంగా కలిసి వచ్చింది. ఇక‌, మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ను 33 శాతానికి పెంచి అమ‌లు చేయ‌డం కూట‌మికి ప్ల‌స్ అయితే.. బీసీ రిజ‌ర్వేష‌న్‌ల‌ను అడ్డుకున్నార‌న్న అప‌ప్ర‌ద వైసీపీ(YCP)ని ముంచింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags
Andhra Pradesh AP Local Body Elections TDP JanaSena BJP AP Politics AP News
Recent Comments
Leave a Comment

Related News