వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డ్

admin
Published by Admin — November 24, 2026 in International
News Image

వైభవ్ సూర్యవంశి. ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. ఈ నూనూగు మీసాల కుర్రోడు అంతర్జాతీయ క్రికెట్లో అరవీర భయంకర బౌలర్లను కూడా ఉతికారేస్తున్న వైనం అందరికీ తెలిసిందే. గత ఐపీఎల్ లో తన సత్తా చాటిన ఈ బీహార్ కుర్రోడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీ బాది ప్రపంచ వన్డే క్రికెట్ లిస్ట్ ఎ చరిత్రలో మరెవరికి సాధ్యం కానీ రికార్డును అందుకున్నాడు. లిస్ట్ ఏ వన్డే క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు.

ఏసిసి మెన్స్ ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ 2026 లీగ్ లో భాగంగా దోహాలో యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ గా క్రీజ్ లోకి వచ్చిన మరు నిమిషమే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఒక ఇన్నింగ్స్ లో 28 సిక్సర్లు బాదిన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వైభవ్ ఆ తర్వాత ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ 28 బంతుల్లో సెంచరీ బాదాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. 40 బంతుల్లో 150వ పరుగుల మార్కులు అందుకున్న ఈ బుడ్డోడు అదే జోరును కొనసాగిస్తూ ఆ తర్వాత 12 బంతుల్లోనే మరో 50 పరుగులు బాదాడు. దీంతో కేవలం 52 బంతుల్లో 200 పరుగులు చేసి లిస్ట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 204 పరుగులు చేసి ఔటయ్యాడు.

Tags
Vaibhav Suryavanshi world record double century
Recent Comments
Leave a Comment

Related News