తమను గెలిపిస్తే నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తాం అని ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికలకు ముందు వాగ్దానం చేయడం కామన్. అయితే, గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవడం…తన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అంతేకాదు, సరైన సమయంలో ఆ నియోజవర్గంలో సరైన నేత ఉండడం…పనులు చేయడం ఇంకా అరుదు. అలా అరుదైన నేతలలో ఒకరు టీడీపీ యువనేత, గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
గుంటూరు పార్లమెంట్ నియోకవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు అనేకం ఉన్నాయి. దానికి తోడు జగన్ సర్కార్ విధ్వంసం వల్ల జిల్లా డెవలప్ మెంట్ లో వెనక్కు వెళ్లింది. ఈ దశలో గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రశేఖర్ ముందు అనేక సవాళ్లున్నాయి. ఆ సవాళ్లను స్వీకరించిన చంద్ర శేఖర్…వాటిని అధిగమిస్తూ ముందుకు వెళుతున్నారు. దశాబ్దాలుగా గుంటూరు నగరవాసులను ఇబ్బందిపెడుతున్న రైల్వే గేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.
ఎంపీగా, కేంద్ర మంత్రిగా 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు శాంక్షన్ చేయించారు. అంతేకాదు, గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం వల్ల కుదేలైన రాష్ట్ర ఖజానాపై ఒక్క రూపాయి భారం కాకుండా మొత్తం రైల్వే నిధులతో ఆ పనులు చేయించి గుంటూరు రూపురేఖలు మార్చారు. తనకు ఎంపీ టికెట్ ఇచ్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు…తనపై, పార్టీపై నమ్మకంతో తనను గెలిపించిన ప్రజలకు…ఈ రకంగా చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.
ఏళ్ల తరబడి గుంటూరువాసులను ముప్పుతిప్పలు పెడుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జ్, గడ్డి పాడు రైల్వే గేట్, నంది వెలుగు రోడ్ రైల్వే గేట్, పలకలూరు రైల్వే గేట్, మంగళగిరి-నిడమర్రు రైల్వే గేట్ల దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మంజూరయ్యాయి. శ్యామలా నగర్, సంజీవయ్య నగర్ రైల్వే గేట్ల దగ్గర కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు తాజాగా మంజూరయ్యాయి. దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపిన పెమ్మసానికి గుంటూరు ప్రజలు రుణపడి ఉంటామంటున్నారు.
కేంద్ర మంత్రులుగా పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు..ఎంపీగా శ్రీ కృష్ణ దేవరాయలు..ఈ ముగ్గురు యువనేతలు రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు పాటుబడుతున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు పెమ్మసాని శాంక్షన్ చేయించారు. రామ్మోహన్ నాయుడు ఏపీలోని ఎయిర్ పోర్టుల నిర్మాణం వేగవంతం చేేయడంతోపాటు సీ ప్లేన్ వంటివి తెచ్చి పర్యాటకాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఈ యువనేతలకు ప్రజలు తమ ప్రాంతంలోని సమస్యలు చెబితే చాలు..పరిష్కరించడంపై వారు ఫోకస్ పెట్టేస్తారు… ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు అన్న టాక్ ప్రజల్లో వచ్చింది.