పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ `ది రాజాసాబ్`. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో నిర్మితమవుతున్న రాజా సాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
`ఈ ఇల్లు నా దేహం.. నా సంపద నా ప్రాణం.. నా తదనంతరం కూడా దీనిని నేను మాత్రమే అనుభవిస్తాను` అంటూ సంజయ్ దత్ డైలాగ్ తో ప్రారంభమైన టీజర్ సినిమా యొక్క మెయిన్ స్టోరీని చెబుతోంది. ఆ తర్వాత స్లో మోషన్ లో ప్రభాస్ ఎంట్రీ, ఆయన వింటేజ్ లుక్, హారర్ ఎలిమెంట్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. రీసెంట్ టైంలో విఎఫ్‌ఎక్స్ నమ్ముకుని తీసిన భారీ చిత్రాలతో పోలిస్తే రాజా సాబ్ అవుట్ ఫుట్ చాలా బెటర్ గా ఉంది.
`హలో హలో బండి కొంచెం మెల్లగా`.. `అసలే మన లైఫ్ అంతంత మాత్రం`.. `నేరాలు పాపాలు ఏంటండీ.. డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తే` అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ సూపర్ క్యూట్ గా అనిపిస్తున్నాయి. నిధి అగర్వాల్, మాళవికలకు కూడా టీజర్ లో షార్ట్స్ పడ్డాయి. చివర్లో `తాత వైరు కొరికేసాడేమో చూడండ్రా బయట` అంటూ ప్రభాస్ భయపడే విధానం సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. మొత్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరే విధంగా మారుతి టీజర్ ను కట్ చేశాడు. ప్రభాస్ లుక్, ఆయన కామెడీ టైమింగ్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచాయి. టీజర్ చూసి ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు అటు సినీ ప్రియులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అని అభిప్రాయపడుతున్నారు.