మ‌హానాడుకు మంత్రుల ఊపు.. సైకిల్ తొక్కిన మ‌హిళా మంత్రి

admin
Published by Admin — May 25, 2025 in Andhra
News Image

ఇక‌, ఈ మ‌హానాడుకు ఊపు తెచ్చేందుకు స‌రికొత్త జోష్ నింపేందుకు మంత్రులు కూడా రెడీ అయ్యారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి భారీ సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా మంత్రి స‌విత‌.. వినూత్న ప్ర‌య‌త్నం చేసి.. కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపారు. త‌న నియోజ‌క‌వ ర్గం అనంతపురంలోని పెనుకొండ నుంచి క‌డ‌ప‌లో మ‌హానాడు ప్రాంగ‌ణం వ‌ర‌కు.. నిర్వ‌హించేలా సైకిల్ యాత్ర‌ను ఆమె ప్రారంభించారు.

ఈ సైకిల్ యాత్ర 22 గంట‌ల పాటు సాగనుంది. మ‌ధ్య‌లో కొద్దిసేపు విరామం తీసుకుని.. తిరిగి ప్రారంభించి చివ‌ర‌కు మ‌హానాడుకు చేరుకునేలా ప్లాన్ చేశారు. తాజాగా ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు పెనుకొం డలో ప్రారంభ‌మైన ఈసైకిల్ యాత్ర‌ను మంత్రి స‌విత ప్రారంభించారు. తాను కూడా స్వ‌యంగా సైకిల్ తొక్కుతూ.. త‌మ్ముళ్ల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. దాదాపు రెండే వేల మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు ఈ సైకిల్ యాత్ర‌లో పాల్గొన్నారు. సుమారు 10 కిలో మీట‌ర్ల వ‌ర‌కు మంత్రి స‌విత సైకిల్ తొక్కారు. ఈ యాత్ర ద్వారా.. త‌మ్ముళ్ల‌లో మ‌రింత ఉత్సాహం నింపాల‌న్న‌ది త‌మ ల‌క్ష్య‌మ‌ని మంత్రి స‌విత పేర్కొన్నారు.టీడీపీ నిర్వ‌హించే అతి పెద్ద పార్టీ పండుగ మ‌హానాడు. దీనికి నాలుగు ద‌శాబ్దాల చ‌రిత్ర ఉంది. తాజాగా నిర్వ‌హిస్తున్న మ‌హానాడును అంత‌కు మించిన ఉత్సాహంతో నిర్వ‌హించేందుకు పార్టీ అధినేత చంద్ర‌బా బు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. మినీ మ‌హానాడులు నిర్వ‌హిం చారు. ఇక‌, మంగ‌ళ‌వారం నుంచి మూడు రోజుల పాటు క‌డ‌ప వేదిక‌గా మ‌హానాడుకు శ్రీకారం చుడుతున్నా రు. ఈ క్ర‌మంలో మంత్రులు కూడా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి భారీ సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రిస్తున్నారు.

Tags
Mahanadu minister savita riding a cycle
Recent Comments
Leave a Comment

Related News