మోడీతో ప‌వ‌న్ భేటీ .. విష‌యం ఏంటి? admin by admin May 26, 2025 in Andhra, Politics, Top Stories

admin
Published by Admin — May 26, 2025 in Andhra
News Image

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అయ్యా రు. ఇలా వ‌రుస‌గా ఏపీ నుంచి శ‌నివారం సీఎం చంద్ర‌బాబు భేటీ కాగా.. మ‌రుస‌టి రోజు.. ఆదివారం ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధానితో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇది మోడీ ఆహ్వానం మేర‌కు జ‌రిగిన కార్య‌క్ర‌మ‌మేన‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి చంద్ర‌బాబు కూడా వెళ్లాల్సి ఉంద‌ని.. కానీ, ఆయ‌న ఇంటి గృహ ప్ర‌వేశం ఉండ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లార‌ని తెలిసింది.

దేశ‌వ్యాప్తంగా బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయే కూట‌మిగా ఏర్ప‌డిన పార్టీలు.. ప‌లు రాష్ట్రాల‌ను పాలిస్తున్నాయి. కేవ‌లం ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఉప ముఖ్య‌మంత్రుల‌తోనే ప్ర‌ధాని ఆదివారం ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏపీ త‌ర‌ఫున ఉప ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క‌మైన రెండు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. 1) ఆప‌రేష‌న్ సిందూర్‌. 2) దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న‌. ఈ రెండు అంశాల‌కు కూడా.. ఏపీ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

`ఆప‌రేష‌న్ సిందూర్` ప్రారంభించిన త‌ర్వాత‌.. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌ధాని మోడీకి మ‌ద్ద‌తు తెలిపింది. అంతే కాదు.. ప‌వ‌న్ పెద్ద లేఖ‌ను కూడా కేంద్రానికి రాశారు. సైనిక ద‌ళాల‌కు అండ‌గా ఉంటామ‌ని.. పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పే క్ర‌మంలో కేంద్రం తీసుకునే చ‌ర్య‌ల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌నిస్ప‌ష్టం చేశారు. అంతేకా దు.. ష‌ష్ట ష‌ణ్ముఖ క్షేత్రాల్లో సైనికుల‌కు దైవ శ‌క్తి కోరుతూ.. పూజ‌లు చేయించారు. తిరంగా ర్యాలీల‌లో సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ప‌వ‌న్ కూడా పాల్గొన్నారు. ఈ విష‌యాల‌ను తాజాగా ఆయ‌న ప్ర‌ధానికి వివ‌రిం చారు.

ఇక‌, కుల గ‌ణ‌న‌పై నా ప్ర‌ధాని చ‌ర్చించారు. దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న‌ను చేయ‌డం ద్వారా ఏయే సామాజిక వ‌ర్గాలు వెనుక‌బ‌డిఉన్నాయ‌న్న‌ది, వారి ఆర్థిక ప‌రిస్థితులు తెలుస్తాయ‌న్న‌ది ప్ర‌భుత్వం యోచ‌న‌. ఈ క్రమంలో దీనికి త్వ‌ర‌లోనే శ్రీకారం చుట్ట‌నున్నారు. ఈ విష‌యాన్ని కూడా తాజాగా ప్ర‌ధాని వివ‌రించారు. దీనికి కూడా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ త‌ర‌ఫున సానుకూలంగా స్పందించారు. దీనికి కూడా అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

Tags
ap deputy cm pawan kalyan meeting pawa met modi pm modi
Recent Comments
Leave a Comment

Related News