కడప జిల్లాలో ఈరోజు ఉదయం టీడీపీ మహానాడు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. అయితే మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు 500 నోట్ల రద్దు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో అవినీతి తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేయడమే మార్గని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా దేశంలో అవినీతి గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో పెద్ద నోట్ల అవసరం లేదని బాబు సూచించారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై చంద్రబాబు స్పందించారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుతామని.. ఆ బాధ్యత తమదని చంద్రబాబు నొక్కి చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి అన్నదాత సుఖీభవ నగదను ఏడాదిలో మూడు విడుతలుగా అందించనున్నట్టు తెలిపారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీనే తమ లక్ష్యని.. రాష్ట్రం ఫస్ట్ అనేదే టీడీపీ నినాదమని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.