మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్.. వైసీపీ అధినేత జగన్‌కు గట్టి సవాల్ రువ్వారు. ఉర్సా కంపెనీకి భూములను ఉచితం గా ఇచ్చామని నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని.. లేకపోతే.. నువ్వేం చేస్తావో చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క టీసీఎస్ కంపెనీకి మాత్రమే ఎకరా 99 పైసలకు ఇచ్చామని చెప్పారు. ఉర్సాకు మార్కెట్ ధరల ప్రకారమే భూములు కేటాయించా మన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించడంలో భాగంగానే ఉర్సాకు ఈ తరహాలో కేటాయించామన్నారు. విశాఖలో పెట్టుబడులు రావడం వల్ల.. పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
టీసీఎస్ సంస్థకు మాత్రం ఎకరాకు రూ.99 పైసలు చొప్పన కేటాయించామన్నారు. దీనికి కొన్నికారణాలు ఉన్నాయని తెలిపారు. అనేక రాష్ట్రాలు టీసీఎస్‌ను ఆహ్వానిస్తున్నాయని.. ఏపీలో పెట్టేందుకు రావాలంటే.. ఆమాత్రం ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే అలా కేటాయించామన్నారు. కానీ, జగన్ మాత్రం పెట్టుబడులపై రాద్ధాం తం చేస్తూ.. విషం చిమ్ముతున్నా రని అన్నారు. ఉర్సాకు ఊరికేనే భూములు ఇచ్చామని ప్రచారం చేస్తన్నారని.. అలాఅని నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని సవాల్ రువ్వారు.
ఇక, విశాఖలోనే పెట్టుబడులు పెరుగుతున్నాయని నారా లోకేష్ చెప్పారు. వీటిని కదిలించడం కూడా ఎవరి తరమూ కాదన్నా రు. గతంలో పెట్టుబడులు తీసుకువస్తే.. తరిమేశారని ఆయన చెప్పారు. కానీ, ఇప్పుడు అన్నీ చూసుకుని పెట్టుబడులు పెట్టేవారు వస్తున్నారని రాష్ట్రంలో ప్రభుత్వం మారబోదన్న ధీమా వారిలో వస్తోందన్నారు. దీనికి చంద్రబాబు పాలనే కారణమని చెప్పారు. కాబట్టి పెట్టుబడులు ఎక్కడికీ పోవని లోకేష్ చెప్పారు. మరోవైపు మద్యం కుంభకోణంలో ఉచ్చు బిగిస్తోందని తెలిసి.. జగన్ నాటకాలకు తెరదీశారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దొంగే.. దొంగ, దొంగ అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారని ఎద్దేవా చేశారు.