వైసీపీ ఎఫెక్ట్‌: ఏపీని కాద‌న్న ఐరోపా కంపెనీ!

admin
Published by Admin — May 28, 2025 in Andhra
News Image

వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోయి.. ప్ర‌జ‌లుచిత్తుగా ఓడించి.. ఏడాది అయినా.. ఆ ప్ర‌భుత్వం తాలూకు భ‌యాలు మాత్రం కంపెనీల‌ను వెంటాడుతున్నాయి. తాజాగా అంత‌ర్జాతీయ కంపెనీ ఒక‌టి ఏపీని కాద‌ని వెళ్లిపో యిం ది. పైకి చెబుతున్న కార‌ణాలు ఏవైనా కూడా అంత‌ర్గ‌తంగా మాత్రం వైసీపీ తాలూకు భ‌యం వెంటాడు తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

దేశంలో మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చాక మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం పెరిగింది. విదేశీ త‌యారీ కంపెనీలు కూడా భార‌త్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎలాన్ మ‌స్క్ టెస్లా, యాపిల్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీలు కూడా వ‌స్తున్నాయి. ఈ ప‌రంప‌ర‌లోనే ఐరోపాకు చెందిన ఎయిర్‌బ‌స్ కంపెనీ.. భార‌త్ లో హెలికాప్ట‌ర్ల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని భావించింది.

ఈ విష‌యం తెలియ‌గానే.. ఏపీ ప్ర‌భుత్వం స‌ద‌రు కంపెనీని వాక‌బు చేసి.. ఏపీలోని అనంత‌పురం, క‌ర్నూ లు త‌దిత‌ర ప్రాంతాల్లో ప్లాంటు ఏర్పాటు చేయాల‌ని కోరింది. దీంతో స‌ద‌రు కంపెనీ ప్ర‌తినిధులు రెండు మాసాల కింద‌ట క‌ర్నూలు, అనంతపురంలో ప‌ర్య‌టించారు. దీనిపై ఆలోచించి చెబుతామ‌ని అప్ప‌ట్లో మీడియా ముందు వ్యాఖ్యానించారు. కానీ, క‌ట్ చేస్తే.. ఈ ప్లాంటు క‌ర్ణాట‌క‌కు త‌ర‌లిపోయింది.

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కోలారు జిల్లా వెమ్‌గల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన‌ట్టు స‌ద‌రు కంపెనీ ప్ర‌క‌టించింది. ఇలా ఏపీకి రావాల్సిన కంపెనీ క‌ర్ణాట‌క‌కు త‌ర‌లి పోవ‌డం చిత్రంగా ఉన్నా.. దీనికి కార‌ణాలు మాత్రం వైసీపీ హ‌యాంలో జ‌రిగిన రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ‌లు.. వివాదాలే కార‌ణ‌మ‌ని.. తెలుస్తోం ది. ఇక‌, ఈ కంపెనీ వ‌చ్చి ఉంటే.. రాష్ట్రానికి 2 వేల మంది ఉద్యోగాలు ద‌క్కించుకునేవారు. అదేవిధంగా స్థానికంగా ఉపాధిమార్గాలు కూడా ఏర్ప‌డి ఉండేవ‌ని అంటున్నారు.

Tags
Airbus company amid left ap rukus in jagan's regime
Recent Comments
Leave a Comment

Related News