ప్ర‌భాస్‌తో త్రిప్తి రొమాన్స్‌.. మ‌ళ్లీ వేలు పెట్టిన ఆర్జీవీ..!

admin
Published by Admin — May 25, 2025 in Movies
News Image

ఇటీవల `వార్ 2` టీజర్ లోని కియారా అద్వానీ బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టిన వల్గర్ పోస్ట్ ఎంతటి వివాదం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెటిజన్ల విమర్శల దెబ్బకు ఆర్జీవీ ఆ ట్వీట్ ను తొలగించారు. అయితే వివాదాలు, విమర్శలు ఆర్జీవీకి కొత్తేమి కాదు. ఎవరేమనుకున్నా తనకనిపించిందే చేస్తారు.. తాను చెప్పాలనుకున్నదే నిక్కచ్చిగా చెప్పేస్తారు. తాజాగా `స్పిరిట్` మూవీ హీరోయిన్ విషయంలోనూ వేలు పెట్టారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించ‌బోయే యాక్షన్ థ్రిల్ల‌ర్ మూవీనే `స్పిరిట్‌`. పోలీస్ స్టోరీ తో రానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో కథానాయికగా దీపికా పడుకోణెను తీసుకున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఆమెను తొలగించినట్లు కూడా ప్రచారం జరిగింది.

అదే తరుణంలో సందీప్‌ రెడ్డి వంగా `స్పిరిట్`పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ తో లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రీ రొమాన్స్ చేయబోతుందంటూ అధికారికంగా ప్రకటించారు. యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించి ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారింది త్రిప్తి. ఆ తర్వాత బాలీవుడ్ లో వ‌రుస‌ అవకాశాలు అందిపుచ్చుకుంటూ బిజీగా మారింది. ఇప్పుడు ఏకంగా ప్ర‌భాస్ మూవీలో అవకాశం ద‌క్క‌డంతో త్రిప్తి మరింత ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఇక త్రిప్తిని హీరోయిన్‌గా తీసుకోవడం పై ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. `హే సందీప్ రెడ్డి వంగా, యూనిమ‌ల్‌లో ఆమె అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు నటన రెండింటినీ పరిశీలిస్తే, మీ నిర్ణయం ఆమెను బాలీవుడ్ లో ప్రస్తుత టాప్ హీరోయ‌న్ల‌ను మించి బిగ్ థింగ్‌గా మారుస్తుందని నేను భావిస్తున్నాను. త్రిప్తి డిమ్రీకి అభినందనలు. నీ స్పిరిట్‌ ఆకాశంలోకి ఎగరడానికి ఇది సరైన సమయం.` అంటూ ఆర్జీవీ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

Tags
Latest news Prabhas ram gopal varma
Recent Comments
Leave a Comment

Related News