ఆయన తొలిసారి విజయం దక్కించుకున్నారు. కానీ.. అటు రాజకీయాలకు, ఇటు ప్రజలకు కూడా ఆయన కొత్తకాదు. గత 10-15 సంవత్సరాలుగా ప్రజలతోనే ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు. వారితో మమేకమై నడుస్తూనే ఉన్నా రు. ఆయనే వేగేశ్న నరేంద్రవర్మ. గత రెండు ఎన్నికల్లోనూ వర్మ.. బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, ఆయనకు పెద్దగా అవకాశాలు చిక్కలేదు. గత ఎన్నికల్లో మాత్రం టికెట్టు-విజయం రెండూ చేరువయ్యాయి. ఇక, అప్పటికే ఆయన ప్రజానాయకుడిగా సేవకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
గత ఏడాది ఎన్నికల తర్వాత.. మరింతగా ప్రజలకు చేరువయ్యారు. సాధారణంగా.. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాల యాలు అంటే.. మహా అయితే.. నాలుగు నుంచి ఐదుకు మించి ఉండవు. అది కూడా పట్టణాలైతేనే. కానీ, బాపట్ల వంటి నియోజ కవర్గాల్లో అయితే.. రెండు మూడుతోనే సరిపుచ్చారు గత ఎమ్మెల్యే. దీంతో ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. బాపట్లకు వచ్చి సమస్య లు చెప్పుకొనే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యేవ ర్మ.. ప్రతి మండలంలోనూ పార్టీ కార్యాలయాన్ని ఏర్పా టు చేశారు. ఆ మండల ప్రజలు.. అక్కడికి వస్తే.. సమస్యలు వినేందుకు కార్యకర్తలను కూడా రెడీ చేశారు.
ఇది పక్కన పెడితే.. తాజాగా బాపట్ల నియోజకవర్గం రికార్డు సృష్టించింది. జల్ జీవన్ మిషన్ అమలులో ఈ నియోజకవర్గం ముందుంది. దీనికి సంబంధించి కేంద్రమే ప్రకటించింది. బాపట్ల నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించే కుళాయి ఏర్పాటుతో పాటు.. సరైన వసతులు కల్పించే దిశగా ఎమ్మెల్యే తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ.. కేంద్రం నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి లేఖ అందింది. గత ఏడాది కాలంలో రహదారుల నిర్మాణం, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు కల్పన వంటివాటిని అందించడంలో బాపట్ల చాలా ముందుంది.
ఈ విషయాలనే పేర్కొంటూ.. కేంద్రం నుంచి లేఖ రావడం గమనార్హం. ఇక, మారు మూల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి గొట్టిపాటి రవితో సమన్వయం చేసుకుని.. విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. అదేసమయంలో సూర్య ఘర్ పథకాన్నికూడా ప్రమొట్ చేస్తున్నారు. తద్వారా.. కేంద్రం అమలు చేస్తున్న పథకాన్ని ప్రజలకు అందించి.. విద్యుత్ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా.. వేగేశ్న చేస్తున్న నిరంతర ప్రయత్నాలు.. కృషి కారణంగా.. మామంచి ఎమ్మెల్యేగా ఆయన బాపట్ల ప్రజలతో జై కొట్టించుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.