తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ సీఎం కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జూలై 8న చర్చకు వస్తామని చెప్పామని.. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటిస్పందనా రాలేదని... కేటీఆర్ అన్నా రు. తాను ప్రెస్‌క్లబ్‌కు వెళ్తున్నానని.. ఎవరు వస్తారో రావాలని వ్యాఖ్యానించారు. తమకు అసెంబ్లీలో కూడా మైక్ ఇవ్వడం లేదని.. తమ గొంతులు నొక్కుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తాను ప్రెస్ క్లబ్‌కు వెళ్తున్నానని.. సీఎం రేవంత్‌కు దమ్ముంటే అక్కడకు రావాలని సవాల్ రువ్వారు. జూలై 8న చర్చలకు రావాలని తాను కోరానని చెప్పారు. సీఎం రాకపోయినా.. ఇతర మంత్రులు వచ్చినా.. తాను చర్చిస్తానన్నా రు. భవిష్యత్తులో అయినా.. చర్చలకు సిద్ధమేనన్న కేటీఆర్.. టైము, ప్లేస్ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని చూసి అధికార పక్షం బెదురుతోందన్న కేటీఆర్.. తమకు మైకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ఇక, నుంచైనా తమకు మైకు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందో చెప్పాలన్నారు. ఎంత మంది రైతులకు రుణ మాఫీ చేశారో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎంత మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ కోరారు.
ఇవన్నీ.. చర్చించేందుకు తాము సిద్ధమేనని చెప్పారు. తెలంగాణ భవన్ నుంచి భారీ సంఖ్యలో అనుచరు లతో ఆయన సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌కు ర్యాలీగా బయలు దేరారు.