తెలుగు చలనచిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్(53) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఫ్రెష్ వెంకట్.. శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో వెంకట్ హాస్యనటుడిగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 100కు పైగా చిత్రాల్లో నటించాడు. తనదైన తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, కామెడి టైమింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఫిష్ వెంకట్ నటనలో కొంతకాలం విలన్ టచ్ ఉండేది. కానీ, ఆ తర్వాత విలనిజం కూడా కామెడీగా మార్చేసాడు. విలన్ క్యారెక్టర్‌తోనూ నవ్వించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. `ఆది`, `ఖుషి`, `దిల్`, `ఢీ`, `గబ్బర్ సింగ్`, `అదుర్స్`, `రేసుగుర్రం`, `ఆర్య 2`, `కందిరీగ`, `సుబ్రమణ్యం ఫర్ సేల్` ఫిష్ వెంకట్ కెరీర్‌లో గుర్తిండిపోయే చిత్రాలు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే..
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. స్వస్థలం మచిలీపట్నం. నటుడు కాకముందు వెంకటేష్ సాదాసీదా చాపల వ్యాపారి. ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్మేవాడు. ఆ సమయంలో అందరూ అతన్ని ఫిష్ వెంకట్‌గా పిలిచేవారు. 1989లో ఓ స్నేహితుడు ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ తో ఫిష్ వెంకట్ కు పరిచయం ఏర్పడింది. ఆయనే 1991లో `జంతర్ మంతర్` సినిమాలో ఫిష్ వెంకట్ కు తొలి అవకాశం కల్పించారు. ఈ సినిమా అతనికి అంతగా గుర్తింపు తేనప్పటికీ.. వెంకట్ నటనపై ఆసక్తితో సినిమాల్లోనే కొనసాగాడు. 2022లో విడుదలైన `ఆది` సినిమా ఫిష్ వెంకట్ కు పేరు తెచ్చి పెట్టింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు సహాయపడింది. ఆ తర్వాత ఆయన కొన్నేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అయితే ఇండస్ట్రీలోకి కొత్త కమెడియన్ల రాకతో ఫిష్ వెంకట్ జోరు తగ్గింది. సినిమా ఛాన్సులు పరిమితంగా మారడం, అదే సమయంలో ఆరోగ్యం చెడిపోవడం, సంపాదించిందంతా వైద్య ఖర్చులకే అయిపోవడంతో ఫిష్ వెంకట్ ఆఖరి రోజుల్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థిక సహాయం అందించాలని అతని భార్య, కూతురు మీడియా ముందుకు రాగా.. తెలంగాణ ప్రభుత్వంతో పాటు పలువురు సినీ ప్రముకులు ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి అండంగా నిలబడ్డారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఫిష్ వెంకట్ కన్నుమూశాడు.