టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా యమ జోరు చూపిస్తుంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా `జూనియర్` మూవీతో ఇటు తెలుగు అటు కన్నడ ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల ప్రేమలో పడిందంటూ గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
`ఆషికి 3` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కార్తీక్ ఆర్జున్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రీసెంట్‌గా కార్తీక్ ఆర్యన్ ఇంట జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో శ్రీలీల పాల్గొనడం, ముంబైలో డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్ కు వెళ్లి ఇద్దరూ మీడియాకు చిక్కడం నెట్టింట జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూర్చాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల ఓపెన్ అయిపోయింది. తన పెళ్లి గురించి బిగ్ అప్డేట్ ఇచ్చింది. `నా ఏజ్ ప్రస్తుతం 24. కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకు 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోను. అసలు పెళ్లి గురించి ఆలోచించేంత తీరిక కూడా నాకు లేదు. నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. నేను లవ్ లో ఉన్నానని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు.
నేను ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ నా వెంట ఉంటుంది. ఒకవేళ నేను ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే ఆమె నాతో ఉండగలదా? అమెరికా వెళ్ళినప్పుడు కూడా అమ్మను తీసుకెళ్లా. అయిన కూడా రూమర్స్ వస్తూనే ఉన్నాయి` అంటూ శ్రీలీల పేర్కొంది. మొత్తానికి ప్రస్తుతం తాను సింగిల్ అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. అలాగే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా తనకు లేదని తేల్చి చెప్పింది.