తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో జరిగిన TAL ప్రీమియర్ లీగ్ (TPL)-2025 ఘనంగా ముగిసింది. ప్రతి ఏటా ఈ క్రికెట్ టోర్నమెంట్ ను TAL ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లు ఇంగ్లండ్‌లోని లాంగ్లీ, స్లౌ క్రికెట్ క్లబ్ లో జరిగాయి. ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో IT Tree Warriors జట్టు విజయం సాధించి TPL 2025 ఛాంపియన్ గా నిలిచింది. Golden Boys జట్టు రన్నరప్ గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో Super Stars జట్టు విజయం సాధించింది.
TPL 2025 టోర్నీ(పురుషుల) విజేతల వివరాలు:
· ఛాంపియన్స్: IT Tree Warriors
కెప్టెన్: ఆకాష్ బండారి | ఫ్రాంచైజీ యజమాని: ధనంజయ్ మద్దుకూరి
· రన్నరప్: Golden Boys
కెప్టెన్: చందు నూతలపాటి | ఫ్రాంచైజీ యజమాని: బెనర్జీ చెరుకూరి
· మూడో స్థానం: Super Stars
కెప్టెన్: కృష్ణ అల్లా | ఫ్రాంచైజీ యజమాని: వేణు నవులూరి
· ఫెయిర్ ప్లే అవార్డు: Vizag Blues
కెప్టెన్: సందీప్ మొవ్వ | ఫ్రాంచైజీ యజమాని: రవి బండారు
వ్యక్తిగత పురస్కారాలు:
· Man of the Series: ఆకాష్ బండారి
· ఉత్తమ బౌలర్: గోపి ముప్పాళ్ల
· ఉత్తమ బ్యాట్స్‌మన్: చందు నూతలపాటి
· ఉత్తమ ఫీల్డర్/కీపర్: శ్రవణ్ తేజ
TAL క్రీడల్లో మహిళలను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంలో పురుషుల జట్లతో పాటు మహిళలకు (TWPL) టోర్నీ నిర్వహించారు. అయితే, ఈ టోర్నీ టీ-10 ఫార్మాట్ లో నిర్వహించారు. పురుషుల జట్ల మధ్య ఫైనల్ జరుగుతున్న రోజు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (TWPL) – T10 క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్లో Mobile 365 Magic Girls జట్టు Galaxy Girls జట్టుపై విజయం సాధించింది.
300 మందికి పైగా పిల్లలు, పెద్దలు ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగిన టోర్నీలో పాల్గొన్నారు. జాతీయ గీతాలతో ప్రారంభమయిన ఈ ఈవెంట్ ఆనందం, క్రీడాస్ఫూర్తి, సమాజ సమైక్యతకు మేటి ఉదాహరణగా నిలిచింది.
టోర్నీలో గెలుపొందిన విజేతలు, రన్నరప్‌లను TAL చైర్మన్ రవి సబ్బా అభినందించారు. IPL మాదిరిగానే TAL Premier League సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందని చెప్పారు. యూరప్‌లోని అతిపెద్ద కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించే T20 క్రికెట్ లీగ్ గా ఈ టోర్నీ ఎదగడం గర్వంగా ఉందన్నారు. ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన TAL స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్ సత్య పెద్ది రెడ్డికి రవి సబ్బా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
TPL కమిటీ సభ్యులు సుభానీ షేక్, శ్రీకాంత్ జెడ్డా, మునీర్ షేక్, హర్ష కగితాల, సిద్దార్థ్ కశ్యప్ గుర్ల మరియు ట్రస్టీలైన కిరణ్ కప్పేట, అనిల్ అనంతుల, శ్రీదేవి ఆలెద్దుల, అశోక్ మాడిశెట్టి, రవి మోచెర్ల, వెంకట్ నీలా గార్లకు ధన్యవాదాలు తెలిపారు.
10 జట్లు 14 వారాలపాటు పోటీపడ్డాయని, మొత్తం 51 మ్యాచ్‌లు నిర్వహించామని, 200కుపైగా ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారని పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో సత్య పెద్ది రెడ్డి చెప్పారు.