పులివెందుల, ఒంటిమిట్టి జడ్పీటీసీ ఉప ఎన్నిక ఏపీలో రాజకీయ వేడి రాజేసింది. ఈ రోజు పోలింగ్ సందర్భంగా ఈ రెండు ప్రాంతాలలో వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి.ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టుకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు టీడీపీ ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు, వైసీపీ నేత సతీష్‌రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు.
వాస్తవానికి పులివెందులలో 30 ఏళ్లుగా ఏ ఎన్నికలయినా సరే బెదిరించి ఏకగ్రీవం చేసుకోవడం కాంగ్రెస్, వైసీపీ నేతలకు ఆనవాయితీ అని సీమలో టాక్. అయితే, ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అక్కడి ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఏకంగా 11 మంది నామినేషన్ వేశారు. ప్రజలు నచ్చిన వారికి ఓటు వేసి గెలిపిస్తారని, వైసీపీ నేతలకు భయం ఎందుకని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.