ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా సీఎం చంద్రబాబు తాజాగా మరి కొంతమంది నేతలకు అవకాశం కల్పించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులకు నామినేటెడ్ పదవులు వరించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ..ఇలా మూడు పార్టీలకు సమన్యాయం చేస్తూ చంద్రబాబు 31 పదవులు కేటాయించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ గా బుచ్చిరాం ప్రసాద్ ను చంద్రబాబు ఎంపిక చేశారు.
గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ నేతగా చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రాం ప్రసాద్ కష్టానికి తగిన ఫలితం లభించింది. పదేళ్ల పాటు అమెరికాలో ఉండి స్వదేశానికి తిరిగి వచ్చి టీడీపీలో చేరిన రాం ప్రసాద్ కు ఎన్నారైలలో కూడా మంచి పేరు, ఎన్నారైల మద్దతు ఉంది. బ్రాహ్మణ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం రాం ప్రసాద్ ఎన్నో ఏళ్లుగా పాటుపడుతున్నారు.
యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాం ప్రసాద్...30 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 10 ఏళ్లు అమెరికాలో ఉండి...ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేశారు. 2013లో టీడీపీలో చేరారు. బ్రాహ్మణ సాధికారక సమితి ప్రెసిడెంట్ గా పదేళ్లుగా పని చేశారు. 2014-19 వరకు ఏపీ ఎన్నార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ గా పని చేశారు. ఈ క్రమంలోనే రాం ప్రసాద్ సేవలకు గుర్తింపుగా సీఎం చంద్రబాబు ఆయనను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు.
ఈ సందర్భంగా బుచ్చి రాం ప్రసాద్ కు 'నమస్తే ఆంధ్ర' శుభాకాంక్షలు తెలియజేస్తోంది.