అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం పార్లమెంటుకు చే రింది. గతంలోనే రాజ్యసభకు ఈ తీర్మానం చేరింది. అయితే.. వివాదం ఏర్పడడం, చైర్మన్‌గా ఉన్న జగ దీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో సదరు తీర్మానాన్ని పక్కన పెట్టారు. తాజాగా అధికార పక్షం ఎన్డీయే కూటమి లోక్‌సభలో ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీనిపై బుధవారం(రేపు) చర్చ చేపట్టను న్నారు. అనంతరం.. రాజ్యసభకు పంపించి.. అక్కడ కూడా దీనిపై చర్చ జరిగిన తర్వాత రాష్ట్రపతికి పంపించనున్నారు.
రాష్ట్రపతి ఆమోద ముద్రతో న్యాయమూర్తిని పదవి నుంచి తప్పించనున్నారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో జస్టిస్ వర్మనివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అనంతరం.. ఆయన నివాసంలోని స్టోర్ రూమ్‌లో కాలిపోయిన 500 రూపాయల నోట్ల కట్టలు వెలుగు చూశాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. న్యాయవ్యవస్థ పారదర్శకతపైనా ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది. దీంతో సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు.. విచారణకు కమిటీని నియమించింది.
ఈ కమిటీ సదరు వ్యవహారాన్ని నిర్ధారించింది. ఆయనను పదవి నుంచితప్పించేందుకు సిఫారసు చేసిం ది. ఇదిలావుంటే.. సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి కూడా ఇదేవిధంగా స్పందించారు. కేంద్రానికి ఆయన సిఫారసు చేస్తూ.. పదవి నుంచి అభిశంసించాలని పేర్కొన్నారు. దీంతో పార్లమెంటులో ఈ వ్యవహారం కీలకంగా మారింది. జస్టిస్ వర్మను అభిశంసించే వ్యవహారంలో తమదే పైచేయిగా ఉండాలని ఎన్డీయే కూటమి, అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయత్నించాయి.
ఏం జరుగుతుంది?
+ తప్పు చేశారని నిర్ధారించినప్పటికీ.. జస్టిస్ వర్మను తొలగించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. ఆయనను పార్లమెంటు ద్వారా(ఏ న్యాయమూర్తినైనా సరే) అభిశంసించాలి.
+ ఇలా అభిశంసనకు గురైన న్యాయమూర్తులకు.. ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి సౌకర్యాలు అందవు. పింఛనులోనూ కోతపడుతుంది.
+ ఎలాంటి ఇంక్రిమెంట్లు వర్తించవు.
+ రిటైర్డ్ న్యాయమూర్తికి ఉన్న సౌకర్యాలను వర్తింపచేయరు.
+ అదేవిధంగా ప్రభుత్వం కనుక ఆయనపై వచ్చిన అభియోగాలపై కేసు నమోదు చేసి విచారించాలని అనుకుంటే.. దీనికి కూడా వెసులుబాటు ఉంటుంది.