ఏపీలో చంద్రబాబు పాలనను విమర్శిస్తున్న జగన్.. ఆయన పాలనను చంబల్ లోయతో పోల్చారు. మీడి యా ముందు నిశిత విమర్శలు చేశారు. ``ఒకప్పుడు చంబల్ లోయ అంటే.. బంది పోట్లకు కేరాఫ్‌గా ఉండే ది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు పాలన కూడా అచ్చంగా అలానే ఉంది.`` అని జగన్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ సమయం మీడియాతో మాట్లాడిన జగన్.. రాసిచ్చిన పుస్తకాన్ని ముందు పెట్టుకుని కామెంట్లు చేయడం గమనార్హం. ``బాబు గారి పాలన ఏందయ్యా అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో!`` అని ఎద్దేవా చేశారు.
అయితే.. గత ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇవే వ్యాఖ్యలు చేశారు. కానీ, ప్రజలు హర్షించలేదు. అయి నా కూడా జగన్‌లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం గమనార్హం. ``ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారు.`` అని జగన్ దు య్యబట్టారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే.. తన సవాల్‌ను స్వీకరించాలంటూ.. పులివెందుల, ఒంటిమిట్టల జడ్పీటీసీల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. దీనికి కేంద్ర బలగాలను తీసుకురావాలన్నారు.
తనకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని చెప్పిన జగన్.. వారంతా పసుపు చొక్కాలు కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. డీఐజీ స్థాయి అధికారి.. నా కొడకా.. అంటూ వ్యాఖ్యానిస్తారా? ఎక్కడైనా ఇది చూశామా? అని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే పోలింగ్ బూతులను మార్చేశారని.. ఓటర్లను ముప్పు తిప్పలు పెట్టారని జగన్ వ్యాఖ్యానించారు. తమకు అనుకూలంగా ఉండే వారిని మాత్రమే అనుమతించారని చెప్పారు. ఒకప్పుడు చంబల్ లోయలో ఇలానే జరిగేవని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీలో ఇలా జరుగుతోందన్నారు.
సీసీ టీవీ ఫుటేజీని ఇచ్చే ధైర్యం ఉందా? అని నిలదీశారు. ఎక్కడెక్కడ ఎంత శాతం ఓట్లు నమోదయ్యా యో చెబుతారా? అని ప్రశ్నించారు. ఎక్కడివారు అక్కడే ఇబ్బందులు పడితే.. 80 శాతం, 70 శాతం పోలింగ్ ఎలా నమోదైందని నిలదీశారు. దీనిపై కోర్టులను ఆశ్రయించనున్నట్టు జగన్ తెలిపారు. తిరిగి ఎన్నికల నిర్వహించేలా కోరతామన్నారు. ``అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్లను మోసగాడు అంటారు.`` ఇప్పుడు చంద్రబాబును ఏమనాలో చెప్పాలని మీడియాను ప్రశ్నించారు.