ఏపీలో మరో విడత నామినేటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా రవి మందలపును ఆయన నియమించారు. రాజమండ్రి సిటీ టీడీపీ నేతగా కొనసాగుతున్న రవి మందలపుకు చంద్రబాబు తగిన గుర్తింపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల జోనల్ కో ఆర్డినేటర్ గా కొనసాగుతున్న రవి మందలపుకు ఎన్నారైల నుంచి మంచి మద్దతు ఉంది.
సీఎం చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందిన రవి మందలపు ముందుగా TANAలో సేవలందించారు. 2004 నుంచి తానా సభ్యుడిగా ఉన్న రవి మందలపు 2017లో తానా ఫౌండేషన్ కు ఎన్నికయ్యారు. 2019-20 కాలంలో తానా ఫౌండేషన్ కార్యదర్శిగా పనిచేశారు. 2021-23 వరకు తానా ఇన్వెస్ట్ మెంట్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. అంతేకాకుండా తన స్వగ్రామం పసుమర్రులో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ లేదా ఖమ్మంలో 200-250 మంది నివసించేలా వృద్ధాశ్రమం నిర్మించాలన్న ఆకాంక్షతో ఆయన ఉన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా ఎంపికైన రవి మందలపునకు నమస్తే ఆంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తోంది.