పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి పులివెందులలో పసుపు జెండా రెపరెపలాడించారు. ఈ క్రమంలోనే ఈ విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి స్పందించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని చంద్రబాబు అన్నారు. అలా జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారని గుర్తు చేశారు. పులివెందుల కౌంటింగ్‌లో 30 ఏళ్ల తరువాత ఓటు వేశామని ప్రజలు సోషల్ మీడియాలో స్లిప్ లు పెట్టారని చెప్పారు. ప్రజలు అలా రియాక్ట్ అయ్యారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు.
అందరు ప్రజలను చైతన్యపరిచే విధంగా మాట్లాడాలని సూచించారు. పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని అన్నారు. 30 ఏళ్ల తరువాత వాళ్ళు ఓటు వేశారన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని ప్రజలకు చెప్పాలని మంత్రులకు సూచించారు. కడప జిల్లాలోని నేతలంతా ఈ విజయంపై రియాక్ట్ కావాలని అన్నారు.