ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన గాడిలో పడింది. జగన్ విధ్వంసకర పాలనకు కుదేలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ అహర్నిశలు పాటుబడుతున్నారు. పాలనలో ఈ ముగ్గురు మొనగాళ్లు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చంద్రబాబు, పవన్, లోకేశ్ కలిసి నడుస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చంద్రబాబు శాంతం..పవన్ శౌర్యం..లోకేశ్ సమరం...ఇలా ఈ ముగ్గురు మూడు లక్షణాలు పునికిపుచ్చుకొని ప్రజాసేవ చేస్తున్న వైనంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కామ్ గా పనిచేసుకుంటూ పోయే చంద్రబాబు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పవన్, ప్రత్యర్థులతో సమరానికి సై అంటూ కాలు దువ్వే లోకేశ్...ఇలా ఈ ముగ్గురు తమ మార్క్ ను చూపిస్తూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారని కాంప్లిమెంట్లు వస్తున్నాయి. ఈ ముగ్గురి కలయిక కొనసాగాలని, రాబోయే ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.