స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సూపర్ సిక్స్ లోని మరో హామీ ‘స్త్రీ శక్తి’ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మహిళలందరికీ నిర్దేశిత బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. అయితే, ఈ పథకం అమలులో క్షేత్ర స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఘాట్ రోడ్ లలో ప్రయాణించే బస్సులలో కూడా ఈ పథకం అమలు చేయాలని ఆదేశించారు. అంతేకాదు, గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీ, లేదా డిజిటల్ కాపీ చూపించినా టికెట్ ఇచ్చేలా నిబంధనలు సవరించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణతో పాటు కర్ణాటకలో ఈ పథకం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఏపీలో అలా జరగకుండా ఉండేందుకు తీసుుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కండక్టర్లకు బాడీ కెమెరాలతో పాటు బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆల్రెడీ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అదనపు బస్సులు నడపాలని, అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.