మిన్నెపొలిస్ ఇండియా ఫెస్ట్ ఇండియా 79వ స్వాతంత్ర దినోత్సవాల సంబరాలలో తానా ‘పాఠశాల’ నార్త్ సెంట్రల్ టీం పాల్గొంది. తానా పాఠశాల సభ్యత్వం, నమోదుతోపాటు పాఠశాల విశిష్టత గురించి తెలియజేస్తూ కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. అమెరికాలో తెలుగు పిల్లలకు సరళమైన తెలుగు నేర్పించి, తెలుగు బాషను భావితరాలకు అందిచాలని ‘పాఠశాల’ ప్రయత్నిస్తోందని తానా పాఠశాల నార్త్ సెంట్రల్ కో ఆర్డినేటర్ నాగరాజు మన్నె అన్నారు.
అమెరికాలోని ప్రవాస తెలుగు ప్రజలు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో తరగతులు ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా పాఠశాల చైర్మన్ భాను మంగుళూరిల ప్రోద్బలంతో ఈ కార్యక్రమం జరిగింది. తానా నార్త్ సెంట్రల్ రిప్రజెంటేటివ్ రామ్ వంకిన, తానా నార్త్ సెంట్రల్ టీమ్ అజయ్ తాళ్లూరి, వేద వ్యాస్ అర్వపల్లి, వెంకట్ జవ్వా, తానా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తానా పాఠశాలలో రిజిస్ట్రేషన్ కోసం కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి
https://paatasala.tana.org/