టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ ఆడియో క్లిప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, అది ఫేక్ ఆడియో అని ప్రసాద్ వివరణనిచ్చినా తారక్ అభిమానులు శాంతించలేదు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, వర్గ పోరును ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని వార్నింగ్ ఇచ్చారట.
దగ్గుపాటి ప్రసాద్ పనితీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే సహించబోనని చంద్రబాబు స్పష్టం చేశారట. అనంతపురంతో పాటు ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. నేతల వ్యక్తిగత చర్యల వల్ల పార్టీకి జరిగే నష్టాన్ని పార్టీ ఎందుకు మోయాలని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇటువంటి పనులు రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవని కొందరు ఎమ్మెల్యలకు చంద్రబాబు నేరుగా వార్నింగ్ ఇచ్చారట.