గ్రామాలు గగ్గోలు పెడుతున్నాయి. కొత్తగా తమకు పింఛన్లు ఇవ్వాలని, తమను నమోదు చేసుకోవాలని గ్రా మీణ స్థాయిలో పెద్ద ఎత్తున పింఛన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే.. ప్రభుత్వం నుంచి స రైన స్పందన కనిపించడం లేదు. ప్రస్తుతం పీ-4పై పెద్ద ఎత్తున దృష్టిపెట్టిన ప్రభుత్వం పేదరికాన్ని తగ్గి స్తే.. ఇక, పింఛన్ల భారం కూడా తగ్గుతుందని ఆశలు పెట్టుకుంది. తద్వారా పింఛన్లు ఇవ్వాల్సిన అవసర మే ఉండబోదని కూడా.. భావిస్తోంది. అందుకే కొత్తగా పింఛన్ల కోసం పెట్టుకుంటున్న దరఖాస్తులు ఎక్కడివక్కడే ఉన్నాయి.
కానీ, గ్రామీణ స్థాయిలో ఇప్పటి వరకు పీ-4పై సరైన అవగాహన రాలేదు. పైగా సామాజిక వర్గాల ఆధారంగా కూడా.. కొందరు దీనిని స్వీకరించేందుకుముందుకు రావడం లేదు. పీ-4 కార్యక్రమంపై ప్రచారం చేయాల ని.. గ్రామీణ ప్రజలను దీనికి ఒప్పించాలని సీఎం చంద్రబాబు పార్టీ నాయకులను కోరుతున్నారు. కానీ, వారు ఈ విషయంలో మొగ్గు చూపడం లేదు. కారణాలు ఏవైనా.. గ్రామీణ ప్రాంతంలో పీ-4 అంటే ఏంటి? అనే ప్రశ్నలే తలెత్తుతున్నాయి. అంతేకాదు.. ఎవరోవచ్చి.. ఏం చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పింఛన్ల కోసంఎదురు చూస్తున్న వారు.. ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంలో గ్రామానికి 150 మంది చొప్పున కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా 60 ఏళ్లు పైబడిన వారే. దీనికి సంబంధించి వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, అధికారులు మాత్రం సర్కారు నుంచి ఎలాంటి సమాచారం లేదని.. వచ్చాక చేస్తామని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారంపై గ్రామీణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించాలని కోరుతున్నారు.
మరోవైపు.. ప్రస్తుతం ఉన్న పించన్లలోనూ.. సర్కారు కోత పెట్టడం మరో వివాదంగా మారింది. దాదాపు 4.5 లక్షల మంది పింఛన్లను ఈ మూడు మాసాల కాలంలో పక్కన పెట్టారన్నది వాస్తవం. వీరిలో దివ్యాంగులు, వృద్ధులు కూడా ఉన్నారు. వీరు కూడా సర్కారు వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. కానీ, వీరంతా అనర్హు లేనని ప్రభుత్వం చెబుతోంది. ఒకవైపు పీ-4 ఇస్తున్నామని.. కాబట్టి.. దానిలో చేరాలని గ్రామీణులకు సూచిస్తూ.. మరోవైపు పింఛన్ల ను కొత్తవిమంజూరు చేయకుండా నిలిపి వేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత అయితే నెలకొంది. దీనిని తగ్గించుకునే దిశగా సర్కారు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.