మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారల పట్టి క్లిన్ కారా గురించి పరిచయాలు అక్కర్లేదు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత చరణ్, ఉపాసనలు తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పారు. 2023 జూన్ 20న క్లిన్ కారా జన్మించింది. అయితే రెండేళ్లైనా ఇంత వరకు రామ్ చరణ్ దంపతులు తమ కూతురు ఫేస్‌ను అఫీషియల్‌గా రివీల్ చేయలేదు. పండుగలు, కుటుంబ వేడుల్లో క్లిన్ కారా కనిపిస్తున్నప్పటికీ ఫేస్ ను మాత్రం కవర్ చేసేస్తున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ క్లిన్ కారాను చూసేందుకు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఉపాసన ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లిన్ కారా డైట్స్ సీక్రెట్స్ రివీల్ చేశారు. కూతురి హెల్త్ కోసం డైలీ ఎటువంటి ఫుడ్ పెడతానో వివరించింది. ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. `నా ఫేవరెట్ ఫుడ్ రాగి సంగటి, మటన్ పులుసు. క్లిన్ కారాకు కూడా రెగ్యులర్ గా రాగి పెడతాను. రాగులతో తయారైన ఆహారాలు చాలా ఆరోగ్యకరం. నా చిన్నతనం నుంచి రాగి ఫుడ్స్ ఇష్టపడతాను. అదే నా కూతురికి అలవాటు చేశాను.
క్లిన్ కారాకు రాగుల్ని ఏ రూపంలో అయినా రోజూ అందించమని ఒకసారి సద్గురు జాగ్గీ వాసుదేవ్ నాకు చెప్పారు. ఆయన కుమార్తె రాధే జగ్గీ కూడా అదే మాట అన్నారు. అందుకే క్లిన్ కారా హెల్తీగా ఉండాలని ఆమె డైలీ డైట్‌లో కచ్చితంగా రాగులతో చేసిన ఏదో ఒక ఫుడ్ ఉండేలా చూస్తాను` అంటూ చెప్పుకొచ్చింది. ఉపాసన పంచుకున్న ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.